పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/27

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

20

శ కు న శా స్త్ర ముక. శ్రీ రాముఁడు సీతాశుభ
   మారూఢిగ విని పదేడు § నట దండెత్తెన్,
   వారధి గట్టను శుభముగ,
   శ్రీరమణ దశాష్టకమున § శిఖినరసింహా,59

తా.నరసింహస్వామీ! పదియేడను పదము విని శ్రీ రామచం
దుఁడు సీతా వృత్తాంతమును యెఱింగెను. పదునెనిమి దను పదము
విని వారధి గట్టెను.

క. నవదశకంబున రాముఁడు
   జవమున రావణుని గెల్చె § సమరజయుండై
   భువి త్రిపురంబుల గెలిచెను
   శివుడిరువది పలుక లొదవ § శిఖినరసింహా,60

తా. ఓ నరసింహస్వామి! పందొమ్మిదను పదము విని శ్రీరా
ముఁడు రావణుని జయించెను. ఇరువదను పదము విని శివుఁడు త్రిపు
రాసులరుల జయించెను.

క . ధర గౌళి తుమ్ము శకునము
    నరయ నవగ్రహములందు § నగు నిజ ఫలముల్
    ధరగౌళి ముష్టి వ్రాతలు
    చెరి సగమగుఁగొంత నిజము § శిఖినరసింహా.61

తా.ఓ నరసింహస్వామి ! తమ్ముశకునము, గౌళిశకునము, మున్న
గునవి సగము ఫలించును. సగము ఫలించవ