ఈ పుట ఆమోదించబడ్డది
20
శ కు న శా స్త్ర ము
క. శ్రీ రాముఁడు సీతాశుభ
మారూఢిగ విని పదేడు § నట దండెత్తెన్,
వారధి గట్టను శుభముగ,
శ్రీరమణ దశాష్టకమున § శిఖినరసింహా,59
తా.నరసింహస్వామీ! పదియేడను పదము విని శ్రీ రామచం
దుఁడు సీతా వృత్తాంతమును యెఱింగెను. పదునెనిమి దను పదము
విని వారధి గట్టెను.
క. నవదశకంబున రాముఁడు
జవమున రావణుని గెల్చె § సమరజయుండై
భువి త్రిపురంబుల గెలిచెను
శివుడిరువది పలుక లొదవ § శిఖినరసింహా,60
తా. ఓ నరసింహస్వామి! పందొమ్మిదను పదము విని శ్రీరా
ముఁడు రావణుని జయించెను. ఇరువదను పదము విని శివుఁడు త్రిపు
రాసులరుల జయించెను.
క . ధర గౌళి తుమ్ము శకునము
నరయ నవగ్రహములందు § నగు నిజ ఫలముల్
ధరగౌళి ముష్టి వ్రాతలు
చెరి సగమగుఁగొంత నిజము § శిఖినరసింహా.61
తా.ఓ నరసింహస్వామి ! తమ్ముశకునము, గౌళిశకునము, మున్న
గునవి సగము ఫలించును. సగము ఫలించవ