పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ కు న శా స్త్ర ము

19


తా. ఓ నరసింహస్వామి! ఆఱు అను పదము విన్న శ్రేయస్క
రము ఏడు అను పదము వినిన జగడము, ఎనిమిది అను పదము విన్న
మరణము తొమ్మిది అను పదము విన్న ధనలాభము శుభము కలుగును,

క. పది సంపద, బహు గెలుపగు
   పదునొక్కట, చావునిజము | పది రెండైతే
   వదమూడు పలుకులై తే
   చెదరును తా నున్నస్థలము | శిఖినరసింహా.56

తా.ఓ నరసింహస్వామి! పది యను పదము విన్న సంపద,
పదకొండు అను పదము వినిన గెలుపు, పన్నెండు అను వదము వినిన
చావు. పదమూఁడు అను పదము వినిన స్థానభష్టతయు గల్గును.

క. మును పాండు రాజతనయులు
   నను వగు రాజ్యంబు విడిచి | యడవికి జని
   రొయ్యన బద మూఁడగు పలుకులఁ
   జిన యోబళగిరి విహార | శిఖినరసింహా,57

తా. చిన యోబళగిరియందు విహరించే యో నరసింహస్వామి!
పదమూఁడను వదము వినుటవలన పాండవులు వురిని విడిచి యడవికి
బోయిరి.

క.పదినాల్గు మేలుఁ బది హే
  న్వదలక సీతాంగనయును | వడి చెఱబోయెన్
   [1] పదు నాఱిట హనుమంతుఁడు
   చెదరక నయ్యబ్ధిదాటె | శిఖినరసింహా,58

తా. ఓ నరసింహస్వామీ! పదునాల్గు అను పదము విన్న మేలు,
పదిహేనను పదము వినుట చేత సీతాదేవి చేఱబోయెను. పదహారను
వదము వినుటచేత హనుమంతుఁడు సముద్రమును దాటెను.

  1. పదహారు వాయునూనుఁడు పాఠాంతరము,