పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

శ కు న శా స్త్ర ము


తా. ఉత్తరదిశయంద':-మరణము, లాభము, శుభము, భావము,
మంచివార్త, సుఖము, భయము, జయము కల్గును.

క. గండము చిచ్చుసుఖము జయ
   మండనె పెండ్లిండ్లు లాభ | మతివల చేటున్
   ఖండిత మీశాన్యంబున,
[1] చెండును యేదోషమైన | శిఖినరసింహా.53

తా. ఈశాన్య దిశయందు:-గండము, అగ్ని భయము, సుఖము ,
జయము', వివాహము, లాభము, స్త్రీ హాని, దోషహరణము కల్గును.

-: వాక్యశ కు న ము:-



క. ఒక పలుకు దనకువమ్మగు
    వికటంబగు సంధి రెండు | వినుజగడము, మూ
    డకటా నాలుగుజగడము
    సిక పట్లౌ సుమ్మీయైదు | శిఖినరసింహా.54

తా. ఓ నరసింహస్వామీ! ఒకటి అను పదము వినిన చేటు. రెండు
అనువదము వినిన సంధి చెడును. మూడు అను పదము వినిన
కలహము, నాలుగు అను పదము వినిన జగడము. ఐదు అనుపదము
వినిన పెద్దకలహమును సంభవించును.

క. ఆఱైతే శ్రేయస్కర
   మేరీతిని జగడమేడు | యెనిమిది మరణం
   బారము ధన శుభ ఫలమగు
   శ్రీరమణ! తొమ్మిదిఁ ట | శిఖ నరసింహా.55

  1. 1.చెందును మా దోషములను 2.చెందును యేదోషమైన అని పాఠాంతరము ,