పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/24

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శ కున శాస్త్రము

17


తా. దక్షిణదిశయందు చుట్టములు, లాభము,కోపము, మరణము
చింత, విందులు, శుభములు, కలుగును.

క. మరణము సంతోషము శుభ
   మరిభయ మశుభంబు హాని |యర్థము సిరులున్
   ధర నెనిమిది జాములకును
   స్థిరముగ నైరృతి ఫలంబు ! శిఖినరసింహా.49

తా. నైరృతి దిశయందు మరణమ, సంతోషము, శుభము, శత్రు
భయము, ఆశుభము హాని, ధనము, సంపద కలుగును.

క. ధనమును జుట్టము, లాభము
   విను మరణము శుభము చేటు | విత్తము సిరులున్
   గనుగొన బడమటి గౌళికి
   చిన యోబళగిరి విహార | శిఖినర సింహా.50

తా. వడమటి డిశయందు ధనము, చుట్టములు, లాభము, మర
ణము శుభము, కీడు, ధనము, సంపద కలుగును.

క. మేలును లాభము ధనమును
   శ్రీలును వాహనము శుభము |స్థిరమును జయమున్
   వాలాయము వాయవ్యము
   శ్రీలోలా జాముగౌళి ! శిఖినరసింహా.51

తా. వాయవ్య దిశయందు:- మేలు, లాభము, ధనము, సంపద ,
నాహనము, శుభము,స్థిరము ,జయము, కలుగును.

క. చావును లాభము శుభమును,
   భావము మేల్వార్తసుఖము | భయమును జయమున్
   యేవెరవున ధనపతిపై
   శ్రీ వెలయఁగ జూముగౌళి ! శిఖినరసింహా,52