పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

శ కు న శా స్త్ర ము

తా. ఓనరసింహా! ప్రయాణమై పోవువారిని పోవద్ద "ని చెప్పినను “ఎందుకు వెళ్లుట" అని చెప్పినను,"నేనునువచ్చెదన" న్నను, “ఎక్కడికి పోయెద” వన్నను, వెళ్ళుచుండఁగా బట్టచెంగు పట్టుకొనినను, అపశకునములు గావున, ప్రాణహాని గల్గును.

క. ముట్టైన యువతి విధవయు,
   గట్టెల మో పధమకులులుఁ | గాకుల రొదయున్
   వట్టి కలశములు బొగ్గులు,
   జెట్టం గలిగించు నండ్రు శిఖనరసింహా. 9

తా. ఓ నరసింహా! ప్రయాణమగునపుఁడు, బహిష్టయయినస్త్రీయు, విధవయు, ఫుల్లలమోపు, నీచజాతివారు, కాకులు కూయుట, వట్టికుండలు, బొగ్గులు, ఎదురైన కష్టములు గలుగును.

క. కుందేలు నంబి తంబళ,
   యందిక జనుచుండు పాము | నఱగొఱ మదియున్
   పందుల గుం పెదురైనను
   చెందును బయనమున ముప్పు శిఖినరసింహా.10

తా, ఓనరసింహా! చెవులపిల్లియు, నంబికులస్థుఁడును, తంబళ కులస్థుఁడు, దగ్గఱగా పోవునట్టి పాము, సందేహమయిన మసస్సు, పందుల గుంపు, ఎదురు పడినచో ప్రయాణములో ముప్పు వాటిల్లును.

క. కై నుండు గొడుగు కఱ్ఱయుఁ
   బైనుండిన యుత్తరియము | పాగా యైనన్
   పైనంబు వేళ ధరఁబడ,
   [1]సేనాకష్టంబు కలుగు | శిఖినరసింహా.11

  1. సేన = బహు, అధికము . దేశీయపదము