పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/12

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శ కు న శా స్త్ర ము

5


తా. ఓ నరసింహస్వామి! చేతి యందున్న గొడుగుగాని, కఱ్ఱగాని, పై మీఁద వేసుకొన్న కండువా గాని, తలగుడ్డగాని, ప్రయాణమగునపుడు క్రిందఁ బడినచో చాలా కష్టములు కలుగును.

క. సమసంఖ్య గాని ద్విజులును
   సములగు శూద్రులు ను బోడి ! సాతానులు జం
   గములు కమసాలు లెందుకు
   చిమిడింతురు జీవములను , శిఖనరసింహా.12

తా. ఓ శిఖినరసింహా! ప్రయాణమై పోవునపుడు బేసి సంఖ్య గల బాహ్మణులు, సరిసంఖ్యగల శూద్రులు, బోడి సాతానులు, విశ్వబాహ్మణులు,జంగములు, ఎదురైనచో జీవములకు నష్టము కలుగును.

క. పెను పొగయు మొండి ముక్కిడి,
    వినఁగొఱ గానట్టి కలత [1]వ్రేఁకటియరపుల్
    పెనుగాలి ధూళియెడనెడఁ
    జినుకులఁ బైనంబు తగదు శిఖినరసింహా.13

తా. ఓ శిఖినరసింహా! ప్రయాణమునకు పెద్దపొగ కనఁబడుట, మొండివాఁడు, ముక్కులేనివాడు, ఎదుర గుట, వినరాని పేచి, గర్భిణీయార్త రవము, పెద్దగాలి, దుమ్ము , వానచినుకులు, ఎదురగుట

అపశకునములు.

  1. వేఁకటి - దేశీయము,