వెలుగోటివారి వంశావళి
35
కలశాబ్ధికల్లోలఘటల బిబ్బోకంబు లమృతాంశుకిరణగుచ్ఛములు[1] సాటి అమృతాంశురణగుచ్ఛాడంబరంబులు[2] వారిజాసనువారువములు సాటి వాని వానికి[3] నివి సాటి వచ్చుఁ గాని సకలభువనైకమౌక్తికచ్ఛత్ర [మనఁగఁ] బరిఢవిల్లిన నీకీర్తి పాటి రావు అన్నపోతాంక వీరనారాయణాంక.
మత్తుఁడు కూర్మరాజు విషమత్తుఁడు నాగవిభుండు మిక్కిలిన్ మత్తుఁడు సూకరాధిపుఁడు మత్తగజంబులు తిండిపోతు లీ తొత్తడిఁగాపురంబు తులఁదూఁగ[4]దటంచును రత్నగర్భ దాఁ[5] బొత్తుల నీభుజాబలము పొందెను రావనపోతభూవరా.
ఘనకపాలంబులు కాయలు గాఁగను వాలుఁజెవులు బైసిణీలుఁ గాఁగఁ[6] గోలెమ్ము[7] వళువుగ బాళిక చర్మంబు నందుఁ గీలించిన యనుచులుగను బెనుపొంద నాసికయును సరస్వతి గాఁగ దట్టంపుఁ బ్రేవులు తంత్రులుగను గరరుహంబులు జీవగఱ్ఱలు గాఁగను జత్రుచయంబులు[8] సారెలుగను