పుట:వెలుగోటివారి వంశావళి.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

వెలుగోటివారి వంశావళి


జయ రమాకరగ్రహణవిస్తారవిభవ
మాజి దాలుతు వెల్లప్పు[1] డవనిలోన
భవ్యగుణహార వేంకటప్రభుకుమార
స్థిరతరాటోప వెలుగోటి సింగభూప.

467


వ.

అతని యనుజుండు.

468


శా.

పేటల్ కోటలు నుగ్గు నూచములు నీభేరీధణంధాణతన్
ధా టైనా భళి నీదె మన్నియదునేదారుల్ సమానంబుగా
బేటీ యందగ[2] నేర్తురే యనిమొనం బెంపొంది తౌ రయ్య వెల్
గోటీవేంకటరామభద్ర బుధరాట్కోరకల్పద్రుమా.

469


సీ.

మత్తారిభూపాలమస్తకంబులె కాని
        ఖండించ దౌర నీఘనకరాసి[3]
వైరిధాత్రీనాథవక్షంబులే గాని
        వరుస మెట్టదు నీదు వరహయంబు
విరసావనీంద్రులవెన్నుపైనే కాని
        తాకదు నీచేతి తఱటుపెట్టు
గర్వితాహితరాజగాత్రంబులే కాని
        కాలరాయదు నీదు[4] గంధగజము
శత్రుమదభంగ రాయవేశ్యాభుజంగ
గండరాతీతబల్లరగండబిరుద
ప్రకటచారిత్ర వేంకటప్రభుసుపుత్ర
రమ్యగుణభద్ర వెలుగోటి రామభద్ర.

470
  1. A.B. దాల్తు యెల్లప్పు
  2. B. యందుగ
  3. A.B. ఖండించదౌర నీ ఘనకరాళి
  4. A.B. ఖండించదౌర నీ