పుట:వెలుగోటివారి వంశావళి.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనుబంధము

రేచర్లవారి బిరుదు

స్వస్తి సమస్త సద్గుణగణాలంకార హేమాద్రి ప్రసిద్ధషోడశదాన మహా
మండలేశ్వర సకలవిద్యాకళాప్రవీణ శ్రీవిష్ణు[భక్తి]పరాయణ విరోధిరాజతిమిర
మార్తాండ పూరితగాంభీర్యరత్నాకర పరనారీదూర మంగళార్థనిమిత్తభవన్మందిర
నిత్యోత్సవ అనవరతకనకకర్బుర దానధారాప్రవాహ ఆరూఢతురగరేఖారేవంత
వనితాజనహృదయవనవసంత ప్రతిగండభైరవ భుజబలభీమ ఖడ్గనారాయణ
గాయగోవాళ హిందూరాయసురత్రాణ పంచపాండ్యదళవిభాళ కాకతిరాయ
రాజ్యస్థాపనాచార్య చలమర్తిగండ మూరురాయజగద్దళ కంచికవాటచూఱకార
క్రొత్తచెర్లసర్వగర్వాపహరణ కొలనివీటివీరక్షేత్రాణోవిజయప్రమోద కుం
ట్లూరుభీమదేవునిశిరఃఖండన రణక్రీడావినోద నెల్లూరువీరక్షేత్రాణోభారతీకమల్ల
తిక్కనబయ్యనప్రాణాపహార తిరుకాళరాజరాజ్యస్థాపనాచార్య ఉద్దండమండలీ
కరగండ సత్యగదేవునితలగొండగండ కన్నడదేవునితలగొండగండ చాళిక్యదేవుని
తలగొండగండ కంకాళదేవునితలగొండగండ ఉదయనదేవునితలగొండగండ
వేములకొండరణరంగస్థలవైరినాయకజీమూతపవన ఏకశిలానగరసమీపశాత్రవ
రాజన్యగహనదావానల బెండపూడివిభాళ నెల్లూరివీరక్షేత్రాణోహల్లకల్లోల
కుంట్లూరిఇమ్మడిమదవిదారణ కారణప్రభవ అరిరాయమీనజాల రాజదేవేంద్ర
వల్లభ జిలుగుపల్లిసంగరాంగణరణోన్ముఖమచ్చనాయకునితలగొండగండ వైరి
సామంతరాగోల కొదమనాయంకరగండ గణపవరదుర్గవిభాళ యిందిరాలాల
ప్రాకార[విభాళ] దన్నాలకోటపరివేష్ఠితకదనపారగ చేకోలుగండ ఇరువత్తుగండ
గండగోపాల రిపురాయమానమర్దన యెఱుకవరప్రాంతసమరసన్నాహ ప్రతికూల
తిమిరమార్తాండ చేకోలుగండ కొలచెలమసప్తాంగదూఱకార గోసంగిదుర్గ
మదాపహార యినుగొర్తినిర్ధూమధామ జల్లిపల్లివీరక్షేత్రాణోభారతీకమల్ల అం
తెంబరగండ నానావర్ణమండలీకరగండ బిరుదుమన్నెవిభాళ ధరణీవరాహ
చౌహత్తమల్ల వరిగొండదుర్గవిభాళ కర్ణాటరాయమానమర్దనభుజాదండ
సత్తికతప్పువరాయరగండ భాషగెతప్పువరాయరగండ మండలీకభుజంగ సంగర