పుట:వెలుగోటివారి వంశావళి.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనుబంధము

వైనతేయ భుజబలాంజనేయ గిరిదుర్గమల్ల జలదుర్గబడబానల వనదుర్గదావానల
స్థలదుర్గవిభాళ హంకారరాజకుమారవేశ్యాభుజంగ త్రిభువనకోటలగొంగ
హొన్నకొట్టుకుదిఱెగట్టమండలీకరగండ హేల్లావరనంట హేల్లావరదగండ
వర్ణాశ్రమప్రతిపాలనోదయ ప్రజమెచ్చుగండ ముమ్మడిబల్లరిగండ జాణకొమార
వివేకనారాయణ ప్రతాపరామావతార ఉన్మత్తరాయమదనమహేశ్వర దని
ఘానరాయబసవశంకర ఉన్మత్తమదనమోహన వశీకరణసంతాప కామినీపంచ
బాణావతార మృగమదఘనసారవివిధసుగంధకుసుమ విచిత్రచీనిచీనాంబర మౌక్తిక
వజ్రవైడూర్యగోమేధికపుష్యరాగఇంద్రనీలమరకతమాణిక్యప్రవాళనవరత్నస్థాపిత
సువర్ణభూషణాలంకార అసిముసలకణయకంపనభల్లాతకభిండివాలకోదండశరచక్ర
క్రకచకుంత కుఠారతోమర పరశువజ్రమార్ష్టకత్తివెరకత్తిసబళకదళపూనిలాంగల
కేరళావోడ్యాణపలకసురియ యత్తళపట్టెసడోంకెనబల్లకత్తిరాయకత్తిత్రిశూల
బత్తీసాయుధప్రవీణ ఏకధాటీసమర్థ విషమధాటీపొంచాల చతురుపాయ
దక్ష రిపుప్రళయాంతకోపేంద్ర అష్టదిగ్రాజమనోభయంకర అవఘళరాయమాన
మర్దన మేదినీరాయదుష్టగజాంకుశ శరణాగతరాజరక్షామణి ఆదిరాజాన్వయచారు
చరిత్ర రేచర్లగోత్రపవిత్ర వీరపాండ్యవిక్రమపాండ్యపరాక్రమపాండ్యసుందర
పాండ్యకులశేఖరపాండ్యలుమొదలైన పంచపాండ్యదళవిభాళ కూటువమన్నె
కుమాళ్లగుండెదిగుల హంకారరాజకుమాళ్లవేశ్యాభుజంగ గర్వితరాచకుమాళ్ళ
వేశ్యాభుజంగ యేబిరుదురగండ సర్వబిరుదకొమరవేశ్యాభుజంగ దళరావుదళ
పతిరావుదళమోదిత్యందళపతిరాయాంచ్ఛామ్లా పొడవనిపోటును పెట్టనిత్యాగ
మును పొగడించుకొనె నాయకాంచ్చామ్లా నవలక్షదాతా చక్రవర్తీ ఐశ్వర్య
దేవతా విష్ణు[భక్తి]పరాయణ సింహతలాట రాయరాహుత్తవేశ్యాభుజంగ
నిచ్చకల్యాణపచ్చతోరణమునుగలిగిన రేచర్లనాయకకులాన్వయబిరుద విజయ
ప్రశస్తి విజయీభవ.

Printed by Rao Brothers (Regd), at Shakti Press Ltd. (Shanti Press). Madras.