వెలుగోటివారి వంశావళి
115
ఘోటఘోటీనిరాఘాటధాటీసము[1] త్పాటితక్షోణి నీప్రబలధాటి భీమభీమాలికాక్షామధూమధ్వజ స్థేమధామంబు[2] నీతేజ మహహ ప్రస్తుతింపంగఁ దరమె దుర్భరవిరోధి కంఠరక్తావగాహెగ్రఖడ్గజనిత విజయరేఖాధరీభూత[3]విక్రమార్క వీర్య[4]సంపన్న పెదకొండవిభునిచెన్న.
బల్లిదమైన బెబ్బులికి బాఱుమృగంబులరీతిఁ గాక యీ చిల్లర మన్నెమూఁకలు విజృంభణవృత్తికి నానఁ బూనునా బల్లరగండమూర్తి రణభార్గవరాముఁడు కొండధారుణీ వల్లభుచెన్నుఁ డాజి కిదె వచ్చెననన్ బరువెత్తు మృత్యువున్.
తారాధిపతియును దారాధిపతియును దారాధిపతియు నీతరమువారు[5] కమలాధిపతియును గమలాధిపతియును గమలాధిపతియు నీకరణివారు పద్మాధిపతియును బద్మాధిపతియును బద్మాధిపతియు నీపగిదివారు[6] ఖచరాధిపతియును ఖచరాధిపతియును ఖచరాధిపతియు నీకడిమివారు[7] శేముషీ సత్కళాజ్ఞానవిశేషమాప్ర తాపనైర్మల్యవాగ్ధనుర్నైపుణీప్ర