పుట:వెలుగోటివారి వంశావళి.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

99


చేపట్టె నూర్జితశ్రీ లెసంగఁగ[1] ధర్మ
        శాస్త్రంబులును ధర్మశాస్త్రములును
గాంచె నక్షీణలక్షణయుక్తి సుకృతిసం
        తతులును సుకృతిసంతతులు వెలయ
నిచ్చె విద్వత్కవీంద్రుల కెలమి నగ్ర
హారములు పేరుగల యగ్రహారములును[2]
సవిధగుండాలవేంకటస్వామిగాక
రాజమాత్రుండె వెలుగోటిరాయఘనుఁడు.

285


సీ.

ఘోటనిరాఘాటధాటిచేఁ బరిపంథి
        పట్టణంబుల ధూళిపటల మాడ[3]
డమరఢమామికా[4]ఢమఢమధ్వనులచే
        గిరిదుర్గములు తలక్రిందు గాఁగ
ఘనధైర్యగుణధుర్యగతిశౌర్యములఁ బేర్చి
        ముగురురాజులు కప్పములు వహింప[5]
స్వామితంత్రద్రోహిజననాయకుల నాజిఁ
        దఱిమికొట్టును వనాంతరములఁ బడ
భీమసైన్యబలోద్ధూతభూమిరేణు
రాజచుళుకితనిఖిలధరాధరుండు[6]
విభవభరితుండు పినకొండవిభుసుతుండు
రసికసులభుండు వెలుగోటిరాయఘనుఁడు.

286
  1. A.B. శ్రీలెసంగుచు
  2. A.B. కాంచన[క్షీ]ణయుక్తి సుకృతిసంతతులు వెలయ విద్వత్కవీంద్రుల కెలమి
    నగ్రహారములు పెరుకల నగ్రహారములను
  3. A.B. ధూరిపటములాడ
  4. A. రణఢమామీ ఢమాధ్వనులచే B. రణఢమాఢమఢమధ్వనులచే
  5. A.B. వహించె
  6. A.B. నిఖిలవరాఘవుండు