మానుగ పెదవడ్డమానొద్ద విడిగొని
యుఱికి జాజువఖాను నఱికినాఁడు
ఆవంచఁ గొనియు గంగావరం బేపున[1]
వంచించ కటు విభాళించినాఁడు
.........................................
.........................................
మదముచే నెదిరిన మామిడేలొద్దను
నల్లుబొప్పని గర్వ మణఁచినాఁడు
...........................................
...........................................
సప్తమాడియములు సాధించి వెసఁ దొడ
చెర్ల భీమారెడ్డిఁ జెండినాఁడు
నెట్టనఁ బాకలపట్టణం బొగి గొని
పట్టి యౌబళనేనిఁ గొట్టినాఁడు
.....................................
........................................
రాజిల్లు సంగమరాయల నాగుల
పాటొద్ద వెస భంగపఱచినాఁడు