పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

......91/691 (6) నిర్ధారించబడిన మొత్తమును చెల్లించుటలో ఎవరేని వ్యక్తి విఫలుడైనపుడు, అతడు నిర్ధారణ ఉత్తర్వు తేదీనుండి ముప్పది దినములు ముగియు నాటికి, నిర్ధారించబడిన మొత్తముతో బాటు, సంవత్సరానికి 16 శాతము చొప్పున ప్రతి ఆరు మాసములకు చక్రవడ్డీని చెల్లించవలెను.

128.(1) సముచిత' కమీషను. ఏవేని లైసెన్సు షరతులను అమలు చేయుటలో వైఫల్యం చెందినాడని లేక ఈ చట్టము. లేదా దానిక్రింద చేయబడిన నియమములు లేదా వినియమముల యొక్క ఏవేని నిబంధనలను అమలు చేయటలో ఉత్పాదక కంపెనీ లేక లైసెన్సుదారు వైఫల్యం చెందినాడని సంతృప్తి చెందిన మీదట, ఏ సమయములో నైనను, వ్రాతపూర్వక ఉత్తర్వు ద్వారా, (ఈ పరిచ్ఛేదములో ఇటు తరువాత "దర్యాప్తు చేయు ప్రాధికారి" అని నిర్దేశించబడి) ఉత్తర్వులో నిర్దిష్ట పరచబడిన ఎవరేని వ్యక్తిని ఏదేని ఉత్పాదక కంపెనీ లేదా లైసెన్సుదారు యొక్క వ్యవహారములను దర్యాప్తు చేయుట మరియు అట్టి దర్యాప్తు చేయు ప్రాధికారి ద్వారా చేయబడిన ఏదేని దర్యాప్తు పై కమీషనుకు నివేదికను పంపమని ఆదేశించవచ్చును.

అయితే, దర్యాప్తు చేయు ప్రాధికారి, ఈ పరిచ్చేదము క్రింద ఏదేని దర్యాప్తులో అతనికి సహాయపడు నిమిత్తం అవసరమైన చోట ఎవరేని ఆడిటరును లేదా ఎవరేని ఇతర వ్యక్తిని నియమించవచ్చును.

(2) కం పెనీల చట్టము, 1956 యొక్క 235వ పరిచ్చేదములోని దానికి వ్యతిరేక ముగా ఏమున్నప్పటికినీ, దర్యాప్తు చేయు ప్రాధికారి, ఏ సమయములో నైనను మరియు సముచిత కమీషనుచే ఆవిధంగా చేయమని ఆదేశించిన మీదట దాని యొక్క ఒకరు లేదా అంత కెక్కువ మంది అధికారులచే ఎవరేని లైసెన్సుదారు లేదా ఉత్పాదక కంపెనీ మరియు అతడి యొక్క ఖాతా పుస్తకములను తనిఖీ చేయవచ్చును. మరియు అట్టి తనిఖీ మీదట దర్యాప్తు చేయు ప్రాధికారి, తన నివేదిక ప్రతిని లైసెన్సుదారుకు సందర్భానుసారంగా ఉత్పాదక కం పెనీకి అందజేయవలెను.

(3) లైసెన్సుదారు సందర్భానుసారముగా ఉత్పాదకకం పెనీ యొక్క ప్రతి మేనేజరు, మేనేజింగు డైరెక్టరు లేదా ఇతర అధికారి, తన అధీనములో లేదా అధికారము క్రింద ఉన్నట్టి అన్ని ఖాతా పుస్తకములు, రిజిస్టరులు మరియు ఇతర దస్తావేజులను ఉప-పరిచ్చేదము (1) క్రింద దర్యాప్తు లేదా ఉప-పరిచ్చేదము (2) క్రింద తనిఖీ చేయమని ఆదేశమివ్వబడిన దర్యాప్తు చేయు ప్రాధికారి సమక్షమున సమర్పించుటకు మరియు దర్యాప్తు చేయు ప్రాధికారి నిర్దిష్ట పరచబడినట్టి సమయము లోపల సదరు దర్యాప్తు చేయు ప్రాధికారి తాను కోరిన తనకు కు అవసరమైన లైసెన్సుదారు. లేదా సందర్భానుసారంగా ఉత్పాదక కంపెనీ యొక్క ఈ వ్యవహారములకు సంబంధించి ఏదేని వివరణ మరియు సమాచారమును ఇచ్చుటకు కర్తవ్యమై ఉండవలెను.