పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

90f G90

విశధీకరణ

: - ఈ పరిచ్చేదము నిమిత్తము,-

(ఎ) "నిర్ధారణ అధికారి" అనగా రాజ్య ప్రభుత్వము ద్వారా అట్లు నామనిర్దేశము చేసిన రాజ్య ప్రభుత్వ లేక బోర్డు యొక్క అధికారి లేక సందర్భానుసారము లైసెన్సుదారు.

(బి) "అనధికార విద్యుచ్ఛక్తి వినియోగము” అనగా:

(i) ఏదేని కృత్రిమ సాధనముల ద్వారా:
(ii) సంబంధిత వ్యక్తి లేక ప్రాధికార సంస్థ లేక లైసెన్సుదారుచే ప్రాధికారమీయ బడని సాధనముల ద్వారా;
(iii) అక్రమముగా మార్చిన మీటరు ద్వారా;
(iv) విద్యుచ్ఛక్తి ఉపయోగము కొరకు కానట్టి ఇతర ప్రయోజనము కొరకు ప్రాధికార మిచ్చుట ద్వారా; లేక
(v) విద్యుచ్ఛక్తి సరఫరా కొరకైన ఆవరణలు లేదా ప్రాంతములు కానట్టి వాటికి ప్రాధికారమిచ్చుట ద్వారా;

విద్యుచ్ఛక్తి వినియోగించుట అని అర్ధము.

127.(1). 126వ పరిచ్చేదము క్రింద చేసిన అంతిమ ఉత్తర్వుకు వ్యధితుడైన ఎవరేని వ్యక్తి, సదరు ఉత్తర్వు తేదీ నుండి ముప్పది రోజుల లోపల అట్టి ప్రరూపములో మరియు అట్టి రీతిలో సత్యాపనము చేసి అపీలు చేసుకొనవచ్చును. మరియు విహితపరచబడు ఆపీలు ప్రాధికార సంస్థకు రాజ్య కమీషను ద్వారా నిర్దిష్ట పరచబడునట్టి ఫీజును జతపరచవలెను.

(2) ఉప-పరిచ్చేదము. (1) క్రింద నిర్ధారణ ఉత్తర్వు పై అపీలు ఏదియు, లైసెన్సుదారు వద్ద నగదులో లేక బ్యాంకు డ్రాప్టు ద్వారా డిపాజిటు చేసిన నిర్ధారిత మొత్తములో సగమునకు సమానమగు మొత్తమును మరియు అట్టి డిపాజిటుకు దస్తావేజు సాక్ష్యమును అపీలుతో సహా జతపరచిననే తప్ప, స్వీకరించరాదు.

(3) ఉప-పరిచ్ఛేదము (1)లో నిర్దేశించబడిన ఆపీలు ప్రాధికారి పక్షకారుల వాదనలు ఆకర్ణింపబడిన పిమ్మట అపీలును పరిష్కరించవలెను. మరియు సముచిత ఉత్తర్వును జారీ చేయవలెను. మరియు ఉత్తర్వు యొక్క ప్రతిని నిర్ధారణ అధికారికి మరియు ఆపీలుదారుకు పంపవలెను.

(4) ఉప-పరిచ్చేదము (1)లో నిర్దేశించిన అపీలు ప్రాధికారి యొక్క ఉత్తర్వు ఉపపరిచ్చేదము (3) క్రింద జారీ చేయబడినది అంతిమమైనదై ఉండును.

(5) ఉప పరిచ్చేదము (1) క్రింద నిర్దేశించబడిన అపీలు ప్రాధికారికి పక్షకారుల సమ్మతితో చేసిన తుది ఉత్తర్వుకు వ్యతిరేకముగా ఎటువంటి అపీలు చేయరాదు.