పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

- 927 192 (4) ఉప-పరిచ్చేదము (1) క్రింద దర్యాప్తు లేదా ఉప పరిచ్ఛేదము (2) క్రింద తనిఖీ చేయమని ఆదేశమివ్వబడిన ఎవరేని దర్యాప్తు చేయు ప్రాధికారి లైసెన్సుదారు లేదా సందర్భానుసారంగా ఉత్పాదక కం పెనీ యొక్క ఎవరేని మేనేజరు, మేనేజింగు డైరెక్టరు లేదా ఇతర అధికారిని అతని వ్యాపార విషయములకు సంబంధించి ప్రమాణం పై పరీక్షించ వచ్చును. మరియు తదనుసారంగా ప్రమాణాలు చేయించవలెను.

(5) దర్యాప్తు చేయు ప్రాధికారి, సముచిత కమీషనుచే దానిని తనిఖీ చేయమని ఆదేశమివ్వబడిన యెడల ఏదేని ఇతర సందర్భములు ఈ పరిచ్ఛేదము క్రింద చేసిన ఏదేని తనిఖీ పై సముచిత కమీషనుకు నివేదించవలెను మరియు

(6) ఉప-పరిచ్చేదము (1) లేదా ఉప సరిచ్చేదము (5) క్రింద ఏదేని నివేదిక అందిన మీదట, సముచిత కమీషను, నివేదికకు సంబంధించి విన్నపము చేయుటకుగాను లైసెన్సుదారుకు లేదా సందర్భానుసారంగా ఉత్పాదక కంపెనీకి సముచిత కమీషను ఉద్దేశములో సబబని భావించినట్టి అవకాశమిచ్చిన పిమ్మట, వ్రాతపూర్వక ఉత్తర్వు ద్వారా; -

(ఎ) నివేదిక నుండి ఉత్పన్నమైన ఏదేని విషయానికి సంబంధించి సముచిత కమీషను యుక్తమని తలచునట్టి చర్య తీసుకొనుటకు లైసెన్సుదారుని లేదా ఉత్పాదక కం పెనీని కోరవచ్చును; లేదా

(బి) లైసెన్సును రద్దు చేయవచ్చును; లేదా

(సి) విద్యుచ్ఛక్తి ఉత్పాదక వ్యాపార నిర్వహణను నిలిపివేయమని ఉత్పాదక కం పెనీని ఆదేశించవచ్చును.

(7) సముచిత క్రమీషను లైసెన్సుదారుకు లేదా సందర్భానుసారంగా ఉత్పాదక కంపెనీకి తగిన నోటీసు ఇచ్చిన తరువాత ఉప పరిచ్ఛేదము (5) క్రింద దర్యాప్తు చేయు ప్రాధికారి ద్వారా సమర్పించబడిన నివేదికను లేదా దానికి అవసరమని భావించునట్టి దాని యొక్క భాగమును ప్రచురించ వచ్చును.

(8) సముచిత కమీషను, లైసెన్సుదారు లేదా ఉత్పాదక కంపెనీ వారి పుస్తకము లలో నిర్వహించవలసిన కనీస సమాచారమును అట్టి సమాచారమును నిర్వహించవలసి యున్నట్టి రీతి, ఆ సందర్భంలో లైసెన్సుదారు లేదా ఉత్పాదక కంపెనీ అవలంభించవలసి యున్న తనిఖీలు మరియు ఇతర సత్యాపనలు మరియు తన అభిప్రాయములో ఈ పరిచ్ఛేదము క్రింద దర్యాప్తు చేయు ప్రాధికారి తన కృత్యములను సంతృప్తికరంగా నెరవేర్చు టకు, ఆవశ్యకతను కల్పించుటకు వాటికి అనుషంగికములైన అన్ని ఇతర విషయములను నిర్ధిష్టపరచవచ్చును.