పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

77677. -

అనుదానములు, నిధి, లెక్కలు, ఆడిటు మరియు రిపోర్టు

98. కేంద్ర ప్రభుత్వము, ఈ విషయమై పార్లమెంటు ద్వారా తగిన వినియోజనము చేసిన పిమ్మట, ఆ ప్రభుత్వము అవసరమని భావించునట్టి డబ్బు మొత్తమును కేంద్ర కమీషనుకు అనుదానములు మరియు అప్పులుగా ఈయవచ్చును.

99.(1) కేంద్ర విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషను నిధి అని పిలువబడు. ఒక నిధిని ఏర్పాటు చేయవలెను. మరియు అందులో ఈ క్రింది వాటిని జమచేయవలెను.

(ఎ) 98వ పరిచ్చేదము క్రింద కేంద్ర ప్రభుత్వము ద్వారా కేంద్ర కమీషనుకు ఇచ్చిన ఏవేని అనుదానములు మరియు అప్పులు;

(బి) ఈ చట్టము క్రింద కేంద్ర కమీషనుచే పొందిన అన్ని ఫీజులు:

(సి) కేంద్ర ప్రభుత్వముచే నిర్ణయించబడు ఆట్టి ఇతర వనరుల నుండి కేంద్ర కమీషను పొందు అన్ని మొత్తములు.

(2) నిధిని,

(ఎ) కేంద్ర కమీషను యొక్క చైర్ పర్సన్, సభ్యులు, కార్యదర్శి, అధికారులు మరియు ఇతర ఉద్యోగుల జీతము బత్తెములు మరియు పారితోషికముకు:

(బి) 79వ పరిచ్ఛేదము క్రింద కేంద్ర కమీషను తన కృత్యములను నిర్వర్తించుటకైన ఖర్చులకు;

(సి) ఈ చట్టము ద్వారా ప్రాధికారమొసగబడిన ఉద్దేశాలు మరియు ప్రయోజనాల నిమిత్తము చేయు ఖర్చులకు

వర్తింపజేయవలెను.

(3) కేంద్ర ప్రభుత్వము, భారత కంట్రోలర్ మరియు ఆడిటరు జనరల్ సంప్రతింపుతో, ఉప పరిచ్చేదము (2) యొక్క ఖండము (బి) మరియు (సి)లో నిర్దిష్ట పరచిన ఖర్చుల కొరకైన నిధిని వర్తింపజేయు రీతిని విహితపరచ వలెను.

100.(1) కేంద్ర కమీషను, - భారత కంప్లోలరు మరియు ఆడిటరు జనరులు సంప్రదింపుతో కేంద్ర ప్రభుత్వము ద్వారా విహితపరచబడునట్టి ప్రరూపములో లెక్కలను మరియు ఇతర సంబంధిత రికార్డులను సక్రమముగా నిర్వహించవలెను మరియు వార్షిక లెక్కల వివరణను తయారుచేయవలెను.

(2) కేంద్ర కమీషను లెక్కలను భారత కంప్లోలరు మరియు ఆడిటరు జనరలుచే నిర్దిష్ట పరచబడునట్టి అంతరావధులలో అతనిచే ఆడిటు చేయించవలెను మరియు అట్టి ఆడిటు సందర్భముగా చేసిన ఏవేని ఖర్చులను భారత కంప్టోలరు మరియు ఆడిటరు జనరలునకు కేంద్ర కమీషను ద్వారా చెల్లించవలసి యుండును.