పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

78/ G78.. (3) భారత కంప్లోలరు మరియు ఆడిటరు జనరలు మరియు ఈ చట్టము క్రింద కేంద్ర కమీషను యొక్క లెక్కలను ఆడిటు చేయు విషయములో అతనిచే నియమింపబడిన ఎవరేని వ్యక్తి, ప్రభుత్వ లెక్కలను ఆడిటు చేయు విషయములో కంప్లోలరు మరియు ఆడిటరు జనరలు వలెనే అట్టి ఆడిటు చేయు విషయములో అవే హక్కులను మరియు విశేషాధికార ములను మరియు ప్రాధికారమును కలిగియుండును. మరియు ప్రత్యేకముగా, పుస్తకాలను, లెక్కలను, సంబంధిత వోచర్లకు మరియు ఇతర దస్తావేజులను మరియు కాగితములను దాఖలు చేయుటకు మరియు కేంద్ర కమీషను యొక్క ఏదేని కార్యాలయమును తనిఖీ చేయుటకు అధ్యర్ధన హక్కు కలిగియుండును.

(4) భారత కాంట్రోలరు మరియు ఆడిటరు జనరులు లేక ఈ విషయమై అతనిచే నియమించబడిన ఎవరేని ఇతర వ్యక్తిచే ధృవీకరించిన కేంద్ర కమీషను యొక్క లెక్కలను దాని పై ఆడిటు రిపోర్టుతోసహా కేంద్ర ప్రభుత్వమునకు వార్షికముగా పంపవలెను. మరియు ఆ ప్రభుత్వము, అది అందిన పిమ్మట వెంటనే పార్లమెంటు యొక్క ప్రతి సదనము సమక్షములో దానిని ఉంచునట్లు చూడవలెను.

101.(1) కేంద్ర కమీషను, ప్రతి సంవత్సరములో ఒకసారి, విహితపరచబడునట్టి ప్రరూపములోను మరియు అట్టి సమయములోను, గత సంవత్సరములో తన కార్యకలాపాల యొక్క సంక్షిప్త వార్షిక నివేదికను తయారు చేయవలెను. మరియు నివేదిక యొక్క ప్రతులను కేంద్ర ప్రభుత్వమునకు పంపవలెను.

(2) ఉప పరిచ్ఛేదము (1) క్రింద అందిన నివేదిక యొక్క ప్రతిని, అది అందిన పిమ్మట వెంటనే, పార్లమెంటు యొక్క ప్రతి సదనము సమక్షములో నుంచవలెను.

102. రాజ్య ప్రభుత్వము, ఈ విషయమై రాజ్య శాసనమండలిచే తగిన వినియోజనము చేసిన పిమ్మట, ఆ ప్రభుత్వము అవసరమని భావించు అట్టి డబ్బు మొత్తములను రాజ్య కమీషనుకు అనుదానములు మరియు అప్పులుగాను ఈయవచ్చును.

103 (1) రాజ్య విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషను నిధి అని పిలువబడు ఒక నిధిని ఏర్పాటు చేయవలెను మరియు దానిలో

(ఎ) 102వ పరిచ్ఛేదము క్రింద రాజ్య ప్రభుత్వముచే రాజ్య కమీషనుకు ఇచ్చిన ఏవేని అనుదానములు మరియు అప్పులు;

(బి) ఈ చట్టము క్రింద రాజ్య కమీషను స్వీకరించిన అన్ని ఫీజులు;

(సి) రాజ్య ప్రభుత్వముచే నిర్ణయించబడు అట్టి ఇతర వనరుల నుండి రాజ్య కమీషను స్వీకరించిన అన్ని మొత్తములు

జమ చేయవలెను.