పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________ (2) ఈ నిధిని;-

(ఎ రాజ్య కమీషను, యొక్క చైర్ పర్సన్, సభ్యులు, కార్యదర్శి, అధికారులు, మరియు ఇతర ఉద్యోగుల జీతము, బత్తెములు మరియు ఇతర పారితోషికములను;

(బి) 86వ పరిచ్ఛేదము క్రింద, తన కృత్యములను నిర్వర్తించుటకై రాజ్య కమీషను చేయు ఖర్చులను;

(సి) ఈ చట్టము ద్వారా ఉద్దేశాలకు మరియు ప్రయోజనాల కొరకు అధికార మీయబడిన ఖర్చులను,

చెల్లించుటకు వర్తింప జేయవలెను.

(3) రాజ్య ప్రభుత్వము, భారత కంప్టోలరు మరియు ఆడిటరు జనరలు సంప్రతింపుతో ఉప - పరిచ్చేదము (2) యొక్క ఖండము (బి) లేక ఖండము (సి) నిర్దిష్ట పరచిన ఖర్చుల చెల్లింపు కొరకు నిధిని వర్తింపజేయు రీతిని విహితపరచవలెను.

104 (1) రాజ్య కమీషను, భారత కంప్లోలరు మరియు ఆడిటరు జనరలు సంప్రదింపుతో రాజ్య ప్రభుత్వము ద్వారా విహితపరచబడునట్టి ప్రరూపములో లెక్కలను మరియు ఇతర సంబంధిత రికార్డులను సక్రమముగా నిర్వహించవలెను మరియు లెక్కల వార్షిక వివరణను తయారు చేయవలెను.

(2) రాజ్య కమీషను లెక్కలను, భారత కంట్రోలరు మరియు ఆడిటరు జనరలుచే నిర్దిష్ట పరచబడునట్టి అంతరావధులలో, అతనిచే ఆడిటు చేయబడవలెను మరియు అట్టి ఆడిటు సందర్భముగా చేసిన ఏవేని ఖర్చులను భారత కంప్లోలరు మరియు ఆడిటరు జనరలుకు రాజ్య కమీషను ద్వారా చెల్లించబడవలెను.

(3) భారత కంట్రోలరు. మరియు ఆడిటరు జనరలు మరియు ఈ చట్టము క్రింద రాజ్య కమీషను యొక్క లెక్కలను ఆడిటు చేయు విషయములో అతనిచే నియమింప బడిన ఎవరేని వ్యక్తి, ప్రభుత్వ లెక్కలను ఆడిటు చేయు విషయములో సాధారణముగా కంప్లోలరు మరియు ఆడిటరు జనరలు వలెనే అట్టి ఆడిటు చేయు విషయములో అవే హక్కులను మరియు విశేషాధికారములను మరియు ప్రాధికారమును కలిగియుండును. మరియు ప్రత్యేకముగా, పుస్తకాలను, లెక్కలను, సంబంధిత వోచర్లను మరియు ఇతర దస్తావేజులను మరియు కాగితములను సమర్పించ మని కోరుటకు మరియు రాజ్య కమీషను యొక్క ఏవేని కార్యాలయములను తనిఖీ చేయుటకు అధ్యర్ధన హక్కు కలిగియుండును.