పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

761 G16 - - (డి) ఏదేని పబ్లికు రికార్డును అభ్యర్థించుట;

(ఇ) సాక్ష్యులను పరీక్షించుటకు కమీషను జారీ చేయుట:

(ఎఫ్) తన యొక్క నిర్ణయాలను, ఆదేశములను మరియు ఉత్తర్వులను పునర్విలోకనము చేయుట;

(జి). విహితపరచబడు ఏదేని ఇతర విషయము.

(2) సముచిత కమీషను, తన సమక్షమునందున్న ఏదేని ప్రొసీడింగు, ఆకర్ణన, లేక విషయములో, కమీషను సముచితమని భావించునట్టి మధ్యకాలీన ఉత్తర్వులను జారీ చేయుటకు అధికారములను కలిగియుండును.

(3) సముచిత కమీషను, తన సమక్షమునందున్న ప్రొసీడింగులలో వినియోగదారుల హితమునకై ప్రాతినిధ్యము వహించుటకు, తాను సబబని భావించు. ఎవరేని వ్యక్తికి ప్రాధికారమీయవచ్చును.

95. సముచిత కమీషను సమక్షమునందున్న అన్ని ప్రొసీడింగులు, భారత శిక్షాస్మృతి యొక్క 193 మరియు 228 పరిచ్చేదముల అర్ధపరిధిలో న్యాయిక ప్రొసీడింగుగా భావించబడవలెను. మరియు సముచిత కమీషను, క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 యొక్క 345 మరియు 346 పరిచ్ఛేదముల నిమిత్తము సివిలు న్యాయ స్థానముగా భావించబడవలెను.

96. సముచిత కమీషను, లేక కమీషనుచే ఈ విషయములో ప్రత్యేకముగ ప్రాధికారమీయబడు ఒక గెజిటెడు అధికారి హోదాకు తక్కువకాని ఎవరేని అధికారి, విచారణ యొక్క వస్తు విషయమునకు సంబంధించి ఏదేని దస్తావేజు కనుగొనబడినట్లు నమ్ముటకు కారణమున్నదని కమీషను అభిప్రాయపడినచో ఏదేని భవనము లేక స్థలములో ప్రవేశించవచ్చును. మరియు తనకు వర్తించునంత మేరకు క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 యొక్క 100వ పరిచ్చేదపు నిబంధనలకు లోబడి అక్కడ నుండి ఏవేని అట్టి దస్తావేజును అభిగ్రహణ చేయవచ్చును లేక ఉదాహృతులను లేక ప్రతులను తీసుకొన వచ్చును.

97. సముచిత కమీషను, తాను అవసరమని భావించినచో (79వ పరిచ్ఛేదము మరియు 86వ పరిచ్చేదము క్రింది వివాదములను అధినిర్ణయించు అధికారములు మరియు 178వ పరిచ్ఛేదము లేక 181వ పరిచ్ఛేదము క్రింద వినియమములను చేయు అధికారములు మినహా) ఈ చట్టము క్రింద అట్టి తన అధికారములు మరియు కృత్యములు, ఉత్తర్వులో నిర్దిష్ట పరచబడు ఏవేని అట్టి షరతులకు లోబడి సముచిత కమీషను యొక్క ఎవలేని సభ్యుడికి, కార్యదర్శికి, అధికారికి లేక ఇతర వ్యక్తికి, వ్రాసియుంచిన సాధారణ లేక ప్రత్యేక ఉత్తర్వు ద్వారా ప్రత్యాయోజనము చేయవచ్చును.