పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

571 667. (3) రాజ్య కమీషను ప్రధాన కార్యాలయము, రాజ్య ప్రభుత్వముచే, అధి సూచన ద్వారా నిర్దిష్ట పరచబడునట్టి స్థలములో ఉండవలెను.

(4) రాజ్య కమీషను, ఛైర్-పర్సన్ 'తోసహా ముగ్గురు సభ్యులకు మించకుండా ఉండవలెను.

(5) రాజ్య కమీషను, చైర్ పర్సన్ మరియు సభ్యులను, 85వ పరిచ్ఛేదములో నిర్దేశించబడిన ఎంపిక కమిటీ సిఫారసు పై రాజ్య ప్రభుత్వముచే నియమించబడవలెను.

83.(1) 82వ పరిచ్ఛేదములోనున్న దానికి విరుద్ధముగా ఏమి ఉన్నప్పటికిని, ఒక సంయుక్త కమీషనును,

(ఎ) రెండు లేక అంతకు మించి రాజ్య ప్రభుత్వముల ద్వారా, లేక

(బి) ఒకటి లేక అంతకు మించి సంఘ రాజ్య క్షేత్రముల మరియు ఒకటి. లేక

అంతకుమించి రాజ్య ప్రభుత్వముల విషయములో కేంద్ర ప్రభుత్వము ద్వారా చేసుకొనబడు కరారును అనుసరించి, ఏర్పాటు చేయవచ్చును. మరియు - అట్టి కాలావధి వరకు మరియు కరారులో నిర్ణీతపరచిన ఏదేని ప్రతి అదనపు కాలావధి కొరకు నవీకరణ చేయుటకు లోబడి అమలు కలిగియుండును.

అయితే, విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషన్ల చట్టము, 1998 యొక్క 21 ఏ పరిచ్చేదము క్రింద ఏర్పాటు చేయబడి మరియు నియమిత తేదీకి అవ్యవహిత పూర్వము అట్లు పనిచేయుచున్న, సంయుక్త కమీషను, ఈ చట్టపు ప్రయోజనాల నిమిత్తము సంయుక్త కమీషనుగా నుండును మరియు దాని యొక్క చైర్ పర్సన్, సభ్యులు, కార్యదర్శి మరియు ఇతర అధికారులు మరియు ఉద్యోగులు ఈ చట్టము క్రింద అట్లు నియమింపబడినట్లుగా భావించబడును. మరియు వారు విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషన్ల చట్టము, 1998 క్రింద ఆ వారు నియమించబడిన ఆవే షరతులు మరియు నిబంధనల పై పదవియందు కొనసాగవలెను.

(2) సంయుక్త కమీషను, పాల్గొను ప్రతి యొక్క రాజ్యములు మరియు సంఘ రాజ్య క్షేత్రముల నుండి ఒక్కొక్క సభ్యుని కూడియుండవలెను. మరియు చైర్ పర్సన్ సర్వసమ్మతి ద్వారా గాని, అది విఫలమైనచో రొటేషను ద్వారా గాని సభ్యులలో నుండి నియమించబడవలెను.

(3) ఉప పరిచ్చేదము (1) క్రింది కరారులో సంయుక్త కమీషను యొక్క నామము నకు, సంయుక్త కమీషను యొక్క చైర్ పర్సన్ మరియు సభ్యుల ఎంపికతో సంబంధమున్న పాల్గొను రాజ్యముల రీతిని, సభ్యుల నియామకము మరియు రొటేషను లేదా సర్వసమ్మతి ద్వారా చైర్ పర్సన్ నియామకపు రీతిని, కమీషను కార్యకలాపము సాగించు స్థలమునకు,