పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________ 66.666 (i) విధానము పై ప్రధాన ప్రశ్నలకు;

(ii) లైసెన్సుదారులచే అందించబడిన సర్వీసుల నాణ్యత, కొనసాగింపు మరియు విస్తరణకు సంబంధించిన విషయములకు;

(iii). లైసెన్సుదారు చే వారి లైసెన్సు యొక్క షరతులు మరియు ఆవశ్యకతల పాటింపుకు; -

(iv). వినియోగదారుని హితమును రక్షించుటకు;

(V) విద్యుచ్ఛక్తి సరఫరా మరియు వినియోగముల ద్వారా మొత్తము మీద ప్రమాణాల నిర్వహణ.

రాజ్య కమీషన్ల సంఘటన, అధికారములు మరియు కృత్యములు

82.(1) ప్రతి రాజ్య ప్రభుత్వము, నియమిత తేదీ నుండి ఆరు మాసముల లోపు, అధి సూచన ద్వారా ఈ చట్టపు, ప్రయోజనాల నిమిత్తము, (రాజ్యము యొక్క పేరు)విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషనుగా పేర్కొనబడు. ఒక రాజ్య కమీషనును ఏర్పాటు చేయవచ్చును.

అయితే, విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషను చట్టము, 1998 యొక్క 17వ పరిచ్ఛేదము క్రింద రాజ్య విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషను రాజ్య ప్రభుత్వముచే స్థాపించబడి, మరియు అనుసూచిలో నిర్దిష్ట పరచిన శాసనములు మరియు నియమిత తేదీకి అవ్యవహిత పూర్వము అట్లు పని చేయుచున్న రాజ్య విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషను ఈ చట్టపు ప్రయోజనాల నిమిత్తము రాజ్య కమీషనుగా ఉండును మరియు చైర్ పర్సన్, సభ్యులు, కార్యదర్శి మరియు దాని యొక్క అధికారులు మరియు ఇతర ఉద్యోగులు ఆ చట్టముల క్రింద వారు నియమించబడిన అవే నిబంధనలు మరియు షరతులపై, పదవియందు - కొనసాగవలెను:

అయితే, ఇంకనూ, విద్యుచ్ఛక్తి క్రమబద్ధీకరణ కమీషన్ల చట్టము, 1998 క్రింద లేక అనుసూచిలో నిర్దిష్ట పరచిన, శాసనముల క్రింద, ఈ చట్టవు ప్రారంభమునకు పూర్వము నియమించబడిన రాజ్య కమీషను యొక్క చైర్ పర్సన్, మరియు ఇతర సభ్యులు, 85వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద ఏర్పాటు చేయబడిన ఎంపిక కమిటీ యొక్క సిఫారసు మేరకు, సంబంధిత రాజ్య ప్రభుత్వము ద్వారా ఈ చట్టము క్రింద నిబంధనలు మరియు షరతుల పై ఎంపిక చేసుకొనుటకు అనుమతించవలెను.

(2) రాజ్య కమీషను, స్థిర మరియు చర ఆస్తులను ఆర్జించు, కలిగియుండు మరియు వ్యయనము చేయు అధికారముతో, శాశ్వత ఉత్తరాధి కారమును మరియు సామాన్య మొహరును కలిగియుండి సదరు పేర్కొనబడిన నామముతో నిగమనికాయముగా నుండును. మరియు కాంట్రాక్టు చేసుకొనవచ్చును. మరియు సదరు నామముతో దావా వేయవచ్చును. మరియు దానిపై దావా వేయబడవచ్చును.