పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________ సంయుక్త కమీషనుకు సంబంధించిన వ్యయములో పాల్గొను రాజ్యముల మధ్య పంచుటకు, సంయుక్త కమీషను మరియు సంబంధిత రాజ్య ప్రభుత్వమునకు మధ్య ఏర్పడిన భిన్నాభి ప్రాయములను తీర్మానించుటకైన రీతికి సంబంధించిన నిబంధనలు కలిగియుండవలెను. మరియు కరారును అమలుపరచుట కొరకు అవసరమని లేక ఉపయుక్తమని భావించబడు ఈ చట్టమునకు అసంగతము కానట్టి ఇతర అనుపూరక, ఆనుషంగిక మరియు పారిణామిక నిబంధనలు కూడా ఉండవలెను.

4) సంయుక్త కమిషను, పాల్గొను రాజ్యములు లేక సంఘ రాజ్య క్షేత్రముల విషయములో విడి విడిగాను మరియు స్వతంత్రంగాను టారిఫ్ ను నిర్ధారించవలెను.

(5) ఈ సరిచ్ఛేదములో ఏమి ఉన్నప్పటికిని, కేంద్ర ప్రభుత్వము, అన్ని పాల్గొను రాజ్యములు అట్లు ప్రాధికారమిచ్చినచో, ఒక సంయుక్త కమీషనును ఏర్పాటు చేయవచ్చును. మరియు ఉప పరిచ్ఛేదము (3) క్రింద నిర్దిష్టపరచిన అన్నీ లేక, ఏవేని విషయములకు సంబంధించి మరియు పాల్గొను రాజ్యముల ద్వారా అట్లు నిర్దిష్టముగా ప్రాధికారమీయ బడినపుడు, అధికారములను వినియోగించవచ్చును.

84.(1) రాజ్య కమీషను యొక్క చైర్ పర్సన్ మరియు సభ్యులు, ఇంజనీరింగు, విత్తీయ, వాణిజ్య, విత్తీయ, న్యాయ లేక మేనేజిమెంటు శాస్త్రములకు సంబంధించిన సమస్యలతో వ్యవహరించుచున్న, తగినంత పరిజ్ఞానము కలిగిన మరియు హోదాలో నుండి, సామర్థ్యము, సమగ్రత, స్థాయి కలిగిన వ్యక్తులై యుండవలెను.

(2) ఉప-పరిచ్చేదము (1)లో ఏమి ఉన్నప్పటికిని, రాజ్య ప్రభుత్వము, ఉన్నత న్యాయస్థానము యొక్క న్యాయధీశునిగా ఉన్న లేక ఉండియున్న వ్యక్తుల నుండి చైర్ పర్సన్ గా ఎవరేని వ్యక్తిని నియమించవచ్చును.

అయితే, ఈ ఉప పరిచ్చేదము క్రింది నియామకమేదియు ఆ ఉన్నత న్యాయస్థానము యొక్క ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిననే తప్ప చేయరాదు.

(3) రాజ్య కమీషను యొక్క చైర్ పర్సన్ లేక ఎవరేని ఇతర సభ్యుడు ఏదేని ఇతర పదవీ యందుండరాదు.

(4) చైర్ పర్సన్, రాజ్య కమీషను యొక్క ప్రధాన కార్యనిర్వాహకుడై ఉండవలెను.

85.(1) రాజ్య ప్రభుత్వము, రాజ్య కమీషను యొక్క సభ్యులను ఎంపిక చేయు నిమిత్తము ఈ క్రింది వారితో కూడిన ఒక ఎంపిక కమిటీని ఏర్పాటు చేయవలెను.