పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________ 22/- 652 . (ఎ) ఏదేని వీధి, రైల్వే లేక ట్రామ్ వే యొక్క భూభాగము మరియు కాలిబాటను త్రవ్వుట మరియు పగులగొట్టుట.

(బి) ఏదేని వీధి, రైల్వే లేక ట్రామ్ వేలలో లేక దాని క్రింద గల ఏదేని మురుగు నీటి కాలువ, డ్రెయిను లేక సొరంగములను త్రవ్వుట మరియు పగులగొట్టుట

(సి) ప్రధాన మురుగు నీటి పైపు కానట్టి ఏదేని లైను లేక పనులు లేక పైపుల స్థితిని మార్చుట

(డి) విద్యుత్ లైనులు, విద్యుత్ ప్లాంటు మరియు ఇతర పనులను చేయుట మరియు ఉంచుట: -

(ఇ) వాటిని మరమ్మత్తు చేయుట, మార్చుట లేక తొలగించుట;

(ఎఫ్) విద్యుచ్ఛక్తి ప్రసారము మరియు సరఫరా కొరకు అవసరమైన అన్ని ఇతర చర్యలను చేపట్టుట.

(2) సముచిత ప్రభుత్వము, ఈ విషయములో తనచే చేయబడిన నియమములను అనుసరించి, ఈ క్రింది వాటిని నిర్దిష్ట పరచవలెను.

(ఎ) పనులను కొనసాగించుటకుగాను అవసరమైన సముచిత ప్రభుత్వము, స్థానిక ప్రాధికారి, సందర్భానుసారము యజమాని లేక ఆక్రమణదారు యొక్క వ్రాతపూర్వక అంగీకారము కలిగిన సందర్భములను మరియు పరిస్థితులను;

(బి) పనులను కొనసాగించుటను యజమాని లేక ఆక్రమణదారు ఆక్షేపించు పరిస్థితులలో ఆనుమతిని మంజూరు చేయు ప్రాధికారి;

(సి) పనులను కొనసాగించుటకు పూర్వము లైసెన్సుదారుచే ఇవ్వబడు నోటీసు యొక్క స్వభావము మరియు కాలావధి:

(డి) ఖండము (సీ)లో నిర్దేశించబడిన నోటీసు ననుసరించి అందిన ఆక్షేపణలను మరియు సలహాలను పర్యాలోచించు ప్రక్రియ మరియు రీతి;

(ఇ) ఈ పరిచ్ఛేదము క్రింది పనుల వలన బాధితులైన వ్యక్తులకు నష్టపరిహారమును లేక అద్దెను నిర్ధారించుట మరియు చెల్లించుట;

(ఎఫ్) అత్యవసర పరిస్థితి ఉన్నపుడు కొనసాగించబడు మరమ్మత్తులు మరియు పనులు:

(జి) ఈ పరిచ్ఛేదము క్రింద కొన్ని పనులు కొనసాగించుటకు యజమాని, లేక ఆక్రమణదారు యొక్క హక్కు మరియు దాని కొరకు చేసిన ఖర్చుల చెల్లింపు:

(హెచ్) మురుగు నీటి కాలువలు, పైపులు లేక ఇతర విద్యుత్తు లైన్లు లేక పనుల దగ్గర ఇతర పసులను కొనసాగించుటకైన ప్రక్రియ

(ఐ) పైపులు, విద్యుత్తు లైన్లు, విద్యుత్తు ప్లాంటు, టెలిగ్రాఫు లైన్లు, మురుగునీటి లైన్లు, సొరంగాలు, డ్రైయిన్లు మొదలగువాటి స్థితిని మార్చుట కొరకైన ప్రక్రియ;