పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

- 51/G51 (5) 10వ భాగములో ఏమి ఉన్నప్పటికిని, అట్టి సరఫరా, ప్రసారము లేక వీలింగును చేపట్టుటకు ఉద్దేశించు పక్షకారులు, తనకు దరఖాస్తు చేసికొనిన మీదట రెండు రాజ్యములలోని రాజ్య క్షేత్రముల ప్రమేయముతో, సందర్భానుసారము ఏదేని అంతర్ రాజ్య విద్యుచ్ఛక్తి సరఫరా ప్రసారము లేక వీలింగు కొరకు టారిఫ్ ను, విద్యుచ్ఛక్తి పంపిణికై ఉద్దేశించు "లైసెన్సుదారుల " విషయములో అధికారితా పరిధి కలిగిన రాజ్య కమీషనుచే ఈ పరిచ్చేదము క్రింద నిర్ధారించబడవలెను. మరియు వాటి కొరకు చెల్లింపు చేయవలెను.

(6) టారిఫ్ ఉత్తర్వు సవరించిన లేక ప్రతిసంహరించిననే తప్ప, టారిఫ్ ఉత్తర్వులో నిర్దిష్ట పరచబడు అట్టి కాలావధి వరకు అమలులో నుండుట కొనసాగును.

65. 62వ పరిచ్చేదము క్రింద రాజ్య కమీషనుచే నిర్ధారించబడిన టారిఫ్ లో ఎవరేని వినియోగదారునికి లేక వినియోగదారుల తరగతికై ఏదేని రాయితీ అనుదానము రాజ్య ప్రభుత్వమునకు అవసరమైనచో, రాజ్య ప్రభుత్వము, 108వ పరిచ్ఛేదము క్రింద ఇవ్వబడు ఏదేని ఆదేశములు ఏమి ఉన్నప్పటికిని, రాజ్య ప్రభుత్వము ద్వారా రాయితీ అనుదానమును అమలుపరచుటకు, లైసెన్సు కొరకు షరతుగాను లేక ఎవరేని ఇతర సంబంధిత వ్యక్తిగా రాజ్య కమీషను ఆదేశించు రీతిలో రాయితీ అనుదానము ద్వారా చెల్లింపుకు గురియగు వ్యక్తికి నష్ట పరిహారపు మొత్తమును అడ్వాన్సుగా మరియు నిర్దిష్ట పరచబడునట్టి రీతిలో చెల్లించవలెను.

అయితే, రాజ్య ప్రభుత్వపు అట్టి ఆదేశమేదియు ఈ పరిచ్ఛేదములో ఉన్న నిబంధనల ననుసరించకుండా చేసిన చెల్లింపు అయినచో అమలులోనికి రాదు. మరియు రాజ్య కమీషను నిర్ణయించిన టారీఫ్ ఈ విషయములో కమీషనుచే జారీ చేయబడిన ఉత్తర్వుల తేదీ నుండి వర్తించును.

66. సముచిత కమీషను, నిర్దిష్ట పరచబడునట్టి రీతిలో (వర్తకముతో సహా) విద్యుత్ మార్కెటు యొక్క అభివృద్ధిని పెంపొందించుటకు కృషి చేయవలెను మరియు ఈ విషయములో 3వ పరిచ్ఛేదములో నిర్దేశించిన జాతీయ విద్యుచ్ఛక్తి విధానము మార్గదర్శకముగా నుండవలెను.

భాగము - 8

పనులు

లైసెన్సుదారుల పనులు

67 (1) ఒక లైసెన్సుదారు, ఆయాసమయములందు, అయితే అతని లైసెన్సు యొక్క నిబంధనలకు మరియు షరతులకు లోబడి, అతని యొక్క సరఫరా లేక ప్రసార ప్రాంతము లోపల లేక అతని లైసెన్సు నిబంధనల ద్వారా అమమతించబడినపుడు, సరఫరా ప్రాంతము వెలుపల విద్యుచ్చకి సరఫరా లైన్లను నిర్మించవచ్చును లేక ఉంచవచ్చును. మరియు అట్టి పనులను ప్రాంతము వెలుపల కొనసాగించవచ్చును. అవేవనగా,