పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________ (5) కమీషను, అతను లేక దాని నుండి తిరిగి వసూలు చేయుటకు అనుమతించు టారిఫ్ మరియు ఛార్జీల నుండి ఆశించిన రాబడులను లెక్కించుట కొరకు నిర్దిష్ట పరచ బడునట్టి ప్రక్రియను పాటించవలెనని ఒక లైసెన్సుదారుని లేక ఒక ఉత్పాదక కంపెనీని కోరవచ్చును.

(6) ఈ పరిచ్ఛేదము క్రింద నిర్ధారించిన టారిఫ్ నకు మించిన ధరను లేక చార్జీని ఎవరేని ఒక లైసెన్సుదారు లేక ఒక ఉత్పాదక కంపెనీ వసూలు చేసినచో, ఆ అధిక మొత్తమును, లైసెన్సుదారు ద్వారా ఖర్చు చేయబడిన ఏదేని ఇతర దాయిత్వమును భంగము వాటిల్లకుండా బ్యాంకు రేటుకు సమానమైన వడ్డీతో సహా అట్టి ధర లేక ఛార్జీ చెల్లించిన వ్యక్తిచే వసూలు చేసుకోనబడదగియుండును.

63. 62వ పరిచ్ఛేదములో ఏమి ఉన్నప్పటికిని సముచిత కమీషను, కేంద్ర ప్రభుత్వముచే జారీ చేయబడిన మార్గదర్శకములను అనుసరించి వేలంపాట యొక్క పారదర్శక ప్రక్రియ ద్వారా అట్టి టారిఫ్ నిర్ధారించబడినచో, ఆ టారిఫ్ ను అనుసరించవలెను.

64(1) 62వ పరిచ్చేదము క్రింద టారిఫ్ నిర్ధారణ కొరకైన దరఖాస్తును, ఒక ఉత్పాదిక కంపెనీ లేక లైసెన్సుదారు, వినియమములచే నిర్ధారించబడునట్టి రీతిలో మరియు అట్టి ఫీజు జతపరచుచు చేయవలెను.

(2) ప్రతి దరఖాస్తుదారు, సముచిత కమీషనుచే నిర్దిష్ట పరచబడునట్టి సంక్షిప్త ప్రరూపము మరియు రీతిలో దరఖాస్తును ప్రచురించవలెను.

(3) సముచిత కమీషను, ఉప పరిచ్చేదము (1) క్రింద దరఖాస్తు అందిన తేదీ నుండి నూట ఇరవై దినముల లోపు మరియు ప్రజల నుండి అందిన అన్ని సలహాలను మరియు ఆక్షేపణలను పర్యాలోచించిన పిమ్మట,

(ఎ) టారిఫ్ ఉత్తర్వులో నిర్దిష్టపరచబడు అట్టి మార్పులతో లేక అట్టి షరతులతో దరఖాస్తును స్వీకరిస్తూ టారిఫ్ ఉత్తర్వును జారీ చేయుట;

(బి) ఈ చట్టపు నిబంధనలు, దాని క్రింద చేసిన నియమములు మరియు వినియమములు లేక తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనపు నిబంధనలను అనుసరించకుండనట్టి దరఖాస్తును, వ్రాసియుంచి రికార్డు చేయబడు కారణములతొ దరఖాస్తును తిరస్కరించుట:

అయితే, దరఖాస్తుదారునకు, అతని దరఖాస్తును తిరస్కరించుటకు పూర్వము ఆకర్ణింపబడుటకు తగిన అవకాశమును ఇవ్వవలెను.

(4) సముచిత కమీషను, ఉత్తర్వును చేసిన ఏడు దినముల లోపు సముచిత ప్రభుత్వమునకు, ప్రాధికారికి మరియు సంబంధిత లైసెన్సుదారుకు మరియు సంబంధిత వ్యక్తికి ఉత్తర్వు ప్రతినొకదానిని పంపవలెను.