పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

49/G49 62.(1) సముచిత కమీషను. ఈ చట్టము క్రింద, నిబంధనలననుసరించి ధరల పట్టీని నిర్ధారించవలెను,-

(ఎ) - పంపిణీ లైసెన్సుదారుకు . ఉత్పాదక కం పెనీ ద్వారా విద్యుచ్ఛక్తి: సరఫరా కొరకు:

అయితే, సముచిత కమీషను, విద్యుచ్ఛక్తి సరఫరాలో కొరత ఏర్పడినపుడు, విద్యుచ్ఛక్తి ధరలను హేతుబద్ధము చేయుటకు ఒక సంవత్సరమునకు మించని కాలావధి కొరకు ఉత్పాదక కంపెనీకి మరియు లైసెన్సుదారుకు మధ్య లేక లైసెన్సుదారుల మధ్య కరారును కుదుర్చు కొన్న కారణముగా విద్యుచ్ఛక్తి విక్రయము లేక కొనుగోలు కొరకు టారిఫ్ కి కనిష్ట లేక గరిష్ట పరిమితులను నిర్ధారించవచ్చును;

(బి) విద్యుచ్ఛక్తి ప్రసారము; (సి) విద్యుచ్ఛక్తి వినిమయము: (డి) విద్యుచ్ఛక్తి చిల్లర విక్రయము.

అయితే, ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ పంపిణీ లైసెన్సుదారులచే అదే ప్రాంతములో విద్యుచ్ఛక్తి పంపిణీ విషయములో, సముచిత కమీషను మనసులను పంపిణీ లైసెన్సుదారుల మధ్య పోటీని పెంపొందించుటకుగాను విద్యుచ్ఛక్తి చిల్లర విక్రయము కొరకు టారిఫ్ యొక్క గరిష్ట పరిమితిని మాత్రమే నిర్ణయించవచ్చును.

(2) సముచిత కమీషను, టారిఫ్ ని నిర్ధారించుట కొరకు ఉత్పాదక ప్రసారము మరియు పంపిణీ విషయములో నిర్దిష్ట పరచబడు వేర్వేరు వివరములను పంపవలసినదిగా ఒక లైసెన్సుదారుని లేక ఒక ఉత్పాదక కం పెనీని కోరవచ్చును.

(3) సముచిత కమీషను, ఈ చట్టము క్రింద టారిఫ్ నిర్ధారించునపుడు, విద్యుచ్ఛక్తి యొక్క వినియోగదారునకు అనుచిత ప్రాధాన్యతను చూపరాదు, కాని వినియోగాదారుని లోడు కారకముగా, విద్యుత్తు కారకముగా, వోల్టేజి, ఏదేని నిర్దిష్ట పరచిన కాలావధిలో విద్యుచ్ఛక్తి వినియోగపు మొత్తము లేక అవసరమైన సరఫరా సమయంలో లేక ఏదేని ప్రాంతపు భౌగోళిక స్థితిలో సరఫరా స్వభావము మరియు సరఫరా అవసరమగు కారణములను అనుసరించి వ్యత్యాసము చూపవచ్చను.

(4) టారిఫ్ లేక ఏదేని టారిఫ్ లోని భాగమును నిర్దిష్ట పరచబడు ఏదేని ఇంధన సర్ ఛార్జీ ఫార్ములా యొక్క షరతుల క్రింద అభివ్య క్తముగా అనుమతించబడిన ఏదేవి మార్పుల విషయములో మినహా ఏదేని విలీయ సంవత్సరములో ఒక్క సారికన్నా తరుచుగా ఎక్కువసార్లు సాధారణముగా సవరించరాదు.