పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________ 231 623 --- (3) సముచిత కమీషను, ఏ కారణముల పై లైసెన్సు ప్రతిసంహరణ ప్రతిపాదించబడినదో. ఆ కారణములను తెలియజేయుచూ లిఖిత పూర్వకమైన మూడు మాసముల కంటే తక్కున కాని నోటీసును లైసెన్సుదారుకు ఇచ్చిననే తప్ప, మరియు ప్రతిపాదిత ప్రతిసంహరణకు వ్యతిరేకముగా నోటీసు కాలావధిలోపల లైసెన్సుదారుచే చూపబడిన ఏదేని కారణమును పర్యాలోచించిననే తప్ప ఉప-పరిచ్ఛేదము (1) క్రింద లైసెన్సు ఏదియు ప్రతిసంహరిచబడరాదు.

(4) సముచిత కమీషను, ఉప-పరిచ్ఛేదము (1) క్రింద లైసెన్సు ప్రతిసంహరించుటకు బదులు, అది సబబని భావించి విధించునట్టి అదనపు నిబంధనలు మరియు షరతులకు లోబడి, లైసెన్సు అమలు నందు ఉండునట్లు అనుమతించవచ్చును. మరియు అట్లు విధించిన ఏవేని అదనపు నిబంధనలు మరియు షరతులకు లైసెన్సుదారు బద్ధుడై ఉండి వాటిని పాటించవలెను, మరియు అవి లైసెన్సులో ఉండియుండినట్లుగా అమలు కావలెను మరియు ప్రభావము కలిగి ఉండవలెను.

(5) కమీషను, ఈ పరిచ్చేదము క్రింద లైసెన్సును ప్రతిసంహరించు నేడల, అది లైసెన్సుదారు పై ప్రతిసంహరణ నోటీసును తామీలు చేయవలెను మరియు ఏ తేదీన ప్రతిసంహరణ అమలులోనికి వచ్చునో ఆ తేదీని నిర్ణయించవలెను.

(6) సముచిత కమీషను, ఉప-పరిచ్చేదము (5) క్రింద లైసెన్సు ప్రతిసంహరణ కొరకు నోటీసు నిచ్చిన యెడల, ఈ చట్టము. క్రింద విధించబడునట్టి ఏదేని శాస్త్రికి లేక ప్రారంభించబడునట్టి అభియోగ ప్రొసీడింగుకు భంగము కలుగకుండ, లైసెన్సుదారు, కమీషను యొక్క పూర్వాను మోదము తరువాత కమీషనుచే లైసెన్సు మంజూరు చేయబడుటకు యోగ్యుడని కనుగొనబడిన ఎవరేని వ్యక్తికి అతడి వినియోగమును అమ్మివేయవచ్చును.

20.(1) సముచిత కమీషను, 19వ పరిచ్చేదము క్రింద ఎవరేని లైసెన్సుదారుని లైసెన్సును ప్రతిసంహరించుకొనిన యెడల, ఈ క్రింది. నిబంధనలు వర్తించవలెను. అవేవనగా

(ఎ) సముచిత కమీషను, ఏ లైసెన్సుదారు లైసెన్సు ప్రతిసంహరించబడినదో ఆ లైసెన్సుదారుని వినియోగమును ఆర్జించుట కొరకు దరఖాస్తులను ఆహ్వానించవలెను మరియు ప్రాథమికంగా వినియోగము కొరకు ఇవ్వజూపబడిన అత్యధిక మరియు మంచి ధర ప్రాతిపదికపై అట్టి దరఖాస్తులలో ఏ దరఖాస్తును స్వీకరించవలెనో నిర్దారించవలెను.