పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

- 221 G2 : (ఎ) ఈ చట్టము ద్వారా లేక ఈ చట్టము లేక దాని క్రింద చేసిన నియమములు లేక వినియమముల క్రింద లైసెన్సుదారు. తాను చేయవలసిన ఏపనినైనను చేయుటలో ఉద్దేశపూర్వక మరియు దీర్ఘకాలిక వ్యతిక్రమణ చేసినాడని సముచిత కమీషను అభిప్రాయపడిన యెడల,

(బి) , లైసెన్సుదారు. తన లైసెన్సు యొక్క ఏ నిబంధనలు లేక షరతులను: అతిక్రమించిన చో లైసెన్సు ప్రతిసంహరించబడునని లైసెన్సులో అభివ్యక్తముగా ప్రఖ్యానించబడినదో అట్టి తన లైసెన్సు యొక్క నిబంధనలు లేక షరతులను భంగపరచిన యెడల

(సి) లైసెన్సుదారు, ఈ విషయములో అతడి లైసెన్సు ద్వారా నిర్ణయించిన ఆ కాలావధి లోపల లేక సముచిత కమీషను అందుకు మంజూరు చేసిన ఏదేని ఆ దీర్ఘకాలిక కాలావధి లోపల,

(i) ఆతడి లైసెన్సు ద్వారా అతనిపై విధించబడిన విధులు మరియు బాధ్యతలను పూర్తిగాను మరియు సమర్థవంతముగాను నిర్వర్తించు స్థితిలో అతడు ఉన్నాడను విషయమును సముచిత కమీషను సంతృప్తి మేరకు తెలియజేయుటలో వైఫల్యము చెందిన యెడల, లేక ,

(ii) అతడి లైసెన్సు ద్వారా కోరబడినట్లుగా డిపాజిటు చేయుటలో లేక సెక్యూరిటీని సమకూర్చుటలో లేక ఫీజు లేక ఇతర ఛార్జీల చెల్లించుటలో వైఫల్యము చెందిన యెడల,

(డి) లైసెన్సు ద్వారా అతడిపై విధించబడిన విధులు మరియు బాధ్యతలను పూర్తిగాను మరియు సమర్ధవంతముగాను నిర్వర్తించగలగినట్టి విత్తేయస్థితిలో లైసెన్సుదారు లేడని సముచిత కమీషను అభిప్రాయపడిన యెడల

లైసెన్సును ప్రతి సంహరించవచ్చును

(2) సముచిత కమీషను ప్రజాహితము దృష్ట్యా అట్లుచేయుట అవసరమని అభిప్రాయపడిన యెడల, దరఖాస్తు పై లేక లైసెన్సుదారుని సమ్మతితో తాము సబబని భావించునట్టి నిబంధలు మరియు షరతులపై అతడి పంపిణీ లేక ప్రసారము లేక వర్తకప్రాంతము అంతయు లేక దానిలోని ఏదేని - భాగమునకు అతడి లైసెన్సును ప్రతిసంహరించవచ్చును.