పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

- 1916 19 (4) కేంద్ర ప్రసార వినియోగము లేక సందర్భానుసారముగ రాజ్య ప్రసార వినియోగము, ఉప-పరిచ్చేదము (3)లో నిర్దేశించిన దరఖాస్తు ప్రతిని అందుకున్న తరువాత ముప్పది దినముల లోపల తమ సిఫార్సులు ఏవేని యున్నచో సముచిత కమీషనుకు పంపవలెను:

అయితే, కమీషను అట్టి సిఫార్సులకు బద్ధమై ఉండవలసిన అవసరం లేదు.

(5) 14వ పరిచ్ఛేదము క్రింద లైసెన్సు మంజూరు చేయుటకు ముందు సముచిత కమీషను,-

(ఎ) ఏ వ్యక్తికి లైసెన్సు జారీచేయుటకు ప్రతిపాదించబడినదో ఆ వ్యక్తి పేరు మరియు చిరునామాను తెలియజేయుచూ కమీషను అవసరమని భావించునట్టి రెండు దిన, వార్తాపత్రికలలో నోటీసు ప్రచురించవలెను.

(బి) కేంద్ర ప్రసార వినియోగము లేక సందర్భానుసారముగ రాజ్య ప్రసార వినియోగము యొక్క సూచనలు లేక ఆక్షేపణలన్నియు మరియు సిఫార్సులు ఏవేనియున్నచో పర్యాలోచించవలెను.

6. ఒక వ్యక్తి, 14వ పరిచ్చేదము యొక్క ఉప-పరిచ్చేదము (1) క్రింద లైసెన్సుదారుగా పనిచేయుటకు దరఖాస్తు చేసినయెడల, ఆచరణీయమైనంత మేరకు అట్టి దరఖాస్తును స్వీకరించిన తరువాత తొంబది దినముల లోపల,

(ఎ) ఈ చట్టము యొక్క నిబంధనలు మరియు దానిక్రింద చేసిన నియమములు మరియు వినియమములకు లోబడి లైసెన్సును జారీచేయ వలెను; లేక

(బి) అట్టి దరఖాస్తు ఈ చట్టము యొక్క నిబంధనలు లేక దాని క్రింద చేసిన నియమములు మరియు వినియమములు లేక తత్సమయమున అమలు నందున్న ఏదేని ఇతర శాసనము యొక్క నిబంధనలకు అనుగుణముగా లేనిచో, లిఖితపూర్వకముగా వ్రాసి యుంచదగు కారణముల పై దరఖాస్తును తిరస్కరించవలెను.

అయితే, దరఖాస్తుదారుడికి ఆకర్షింపబడుటకు అవకాశము ఇచ్చిననే తప్ప దరఖాస్తు ఏదియు తిరస్కరించబడరాదు.

(7) సముచిత కమీషను, లైసెన్సు జారీ చేసిన వెంటనే, లైసెన్సు ప్రతిని సముచిత ప్రభుత్వము, ప్రాధికార సంస్థ, స్థానిక ప్రాధికార సంస్థకు మరియు సముచిత కమీషను అవసరమని భావించునట్టి ఇతర వ్యక్తికి పంపవలెను.

(8) అట్టి లైసెన్సు ప్రతిసంహరణ చేయబడిననే తప్ప లైసెన్సు ఇరువది ఐదు సంవత్సరముల కాలావధి వరకు అమలు కొనసాగవలెను.