పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

18/G18 అంతేకాక, ఒక వ్యక్తి, రాజ్య ప్రభుత్వముచే అధి సూచించబడునట్టి గ్రామీణప్రాంతములో విద్యుచ్ఛక్తి ఉత్పాదనను మరియు పంపిణీకి ఉద్దేశించిన యెడల, అట్టివ్యక్తి, అట్టి విద్యుచ్ఛక్తి ఉత్పాదన మరియు పంపిణీ కొరకు ఏదేని లైసెన్సును తీసుకొనవలసిన 'అవసరం కూడా ఉండదు. అయితే, అతడు .. 53వ పరిచ్చేదము. క్రింద ప్రాధికార సంస్థచే నిర్దిష్ట పరచబడునట్టి చర్యలను తీసుకొనవలెను.

అంతేకాక, పంపిణీ లైసెన్సుదారు. విద్యుచ్ఛక్తి వర్తకమును చేపట్టుటకు కూడా లైసెన్సు - తీసుకొనవలసిన అవసరం ఉండదు.

15.(1) 14వ పరిచ్చేదము క్రింద ప్రతియొక దరఖాస్తు, సముచిత కమీషనుచే నిర్దిష్ట పరచబడునట్టి ప్రరూపము మరియు రీతిలో చేసుకొనవలెను. మరియు విహిత పరచబడునట్టి ఫీజుతో జత చేయబడవలెను.

(2) లైసెన్సు మంజూరు కొరకు దరఖాస్తు చేసిన ఎవరేని వ్యక్తి, అట్టి దరఖాస్తును చేసిన తరువాత ఏడుదినముల లోపల నిర్దిష్ట పరచబడునట్టి రీతిలో అట్టి వివరములతో తన దరఖాస్తు నోటీసును ప్రచురించవలెను. మరియు

(i) ప్రచురించిన దరఖాస్తుకు సమాధానముగా సముచిత కమీషనుచే స్వీకరించబడిన ఆక్షేపణలు ఏవేని యున్నచో అవి దానిచే పర్యాలోచించబడినవే తప్ప,

అయితే, పైన చెప్పిన విధముగా నోటీసు ప్రచురించిన తేదీ నుండి ముప్పది దినములు ముగియుటకు ముందు స్వీకరించబడిన ఆక్షేపణ ఆయననే తప్ప ఆక్షేపణ ఏదియు పర్యాలోచించరాదు:

(ii) ఏదేని కంటోన్మెంట్, విమానాశ్రయము, కోట, ఆయుధశాల, నౌకా నిర్మాణకేంద్రము లేక శిబిరము లేక రక్షణ ప్రయోజనముల కొరకు ప్రభుత్వ స్వాధీనములో ఉన్నట్లే ఏదేని భవనము లేక స్థలము యొక్క పూర్తి భాగము గాని లేక ఏదేని భాగముతో సహా ఒక ప్రాంతమునకు లైసెన్సు కొరకైన దరఖాస్తు విషయములో లైసెన్సు మంజూరు చేయుటకు, కేంద్ర ప్రభుత్వమునకు అభ్యంతరము లేదని సముచిత కమీషను ధ్రువపరచుకోనునంత వరకు

లైసెన్సు మంజూరు చేయరాదు.

(3) ప్రసార లైసెన్సుదారుగా పనిచేయుటకు ఉద్దేశించుచున్న వ్యక్తి, దరఖాస్తు చేసిన వెంటనే కేంద్ర ప్రసార వినియోగము లేక సందర్భానుసారముగ రాజ్యప్రసార వినియోగమునకు అట్టి దరఖాస్తు ప్రతినొకదానిని పంపవలెను.