పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

20/-G20 . 16. " సముచిత కమీషను, లైసెన్సుదారునికి గాని లేక లైసెన్సుదారుల తరగతికి గాని వర్తించు. ఏవేని సాధారణ లేక నిర్దిష్ట షరతులను నిర్దిష్ట పరచవచ్చును. మరియు అట్టి షరతులను సదరు లైసెన్సు షరతులుగా భావించవలెను.

అయితే, సముచిత కమీషను, నియతము చేయబడిన తేదీ నుండి ఒక సంవత్సరము లోపల, ఈ చట్టము ప్రారంభమైనప్పటి నుండి ఒక సంవత్సరము ముగిసిన తరువాత 14వ పరిచ్చేదమునకుగల. మొదటి, రెండవ, మూడవ, నాలుగవ మరియు ఐదవ వినాయింపు లలో నిర్దేశించిన లైసెన్సుదారులకు వర్తించు. లైసెన్సు యొక్క ఏవేని సాధారణ లేక నిర్దిష్ట షరతులను నిర్దిష్ట పరచవలెను.

17 (1) ఏ లైసెన్సుదారు, సముచిత కమీషను పూర్వానుమోదము లేకుండ,-

(ఎ) ఎవరేని ఇతర లైసెన్సుదారు యొక్క వినియోగము కొనుగోలు లేక స్వాధీనము చేసుకొనుట ద్వారా లేక ఇతర విధముగా ఆర్జించుటకు ఏదేని లావాదేవిని జరుపరాదు; లేక

(బి) తన వినియోగమును ఎవరేని ఇతర లైసెన్సుదారుని వినియోగముతో సంవిలీనం చేయరాదు;

అయితే, ఈ ఉప పరిచ్చేదములోనున్నదేదియు, లైసెన్సుదారు యొక్క వినియోగము, ఖండము (ఎ) లేక ఖండము (బి)లో నిర్దేశించిన వినియోగము ఉన్నటువంటి రాజ్యము కానట్టి రాజ్యములో ఉన్నచో వర్తించదు.

(2) ప్రతియొక లైసెన్సుదారు, ఉప పరిచ్ఛేదము (1) క్రింద ఆమోదము పొందుటకు ముందు, సదరు ఆమోదము కొరకు దరఖాస్తు చేసుకొనినట్టి లైసెన్సుదారు యొక్క ప్రాంతములో విద్యుచ్ఛక్తి ప్రసారము లేక పంపిణీచేయు. ప్రతియొక ఇతర లైసెన్సుదారుకు ఒక మాసముకంటే తక్కువ కానట్టి నోటీసును ఈయవలెను.

(3) ఏ లైసెన్సుదారు, సముచిత కమీషను పూర్వాను మోదము లేకుండ అమ్మకము, లీజు, మార్పిడి ద్వారా లేక ఇతర విధముగా ఏ సమయములో నైనను తన లైసెన్సును అప్పగించరాదు. లేక తన వినియోగమును లేక దానిలోని ఏదేని " భాగమును అంతరణ చేయరాదు.

(4) ఉప-పరిచ్ఛేదము (1) లేక ఉప పరిచ్ఛేదము (3)లో నిర్దిష్టపరచిన ఏదేని ఈ వ్యవహారమునకు సంబంధించిన ఏదేని కరారు, సముచిత కమీషను పూర్వాను మోదముతో చేసినదైననే తప్ప చెల్లనిదగను.