పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

171 G17. అంతేకాక, కేంద్ర ప్రసార వినియోగము లేక రాజ్య ప్రసార వినియోగమును ఈ చట్టము క్రింద ప్రసార లైసెన్సుదారుగా భావించవలెను.

అంతేకాక, ఈ చట్టము ప్రారంభమునకు ముందు లేక తరువాత సముచిత ప్రభుత్వము, విద్యుచ్ఛక్తి ప్రసారము లేక విద్యుచ్ఛక్తి పంపిణీ లేక విద్యుచ్ఛక్తి వర్తకం చేపట్టిన సందర్భములో అట్టి ప్రభుత్వమును కూడా ఈ చట్టము క్రింద లైసెన్సుదారుగా భావించవలెను, అయితే, ఈ చట్టము క్రింద దానికి లైసెన్సు తీసుకొనవలసిన అవసరం ఉండదు:

అంతేకాక, దామోదర్ వ్యాలీ కార్పొరేషను చట్టము, 1948లోని 3వ పరిచ్ఛేదము యొక్క ఉప-పరిచ్చేదము (1) క్రింద స్థాపించిన దామోదర్ వ్యాలీ కార్పొరేషనును కూడా ఈ చట్టము క్రింద లైసెన్సుదారుగా భావించవలెను. అయితే ఈ చట్టము క్రింద దానికి కూడా లైసెన్సు తీసుకొనవలసిన అవసరం ఉండదు. మరియు దామోదర్ వ్యాలీ కార్పొరేషను చట్టము, 1948 యొక్క నిబంధనలు ఈ చట్టము యొక్క నిబంధనలకు అసంగతముగా లేనంత మేరకు సదరు కార్పొరేషనుకు వర్తించుట కొనసాగవలెను.

అంతేకాక, ఈ చట్టములోని 131వ పరిచ్చేదము యొక్క ఉప-పరిచ్చేదము (2)లో పేర్కొనిన ప్రభుత్వ కంపెనీ లేక కంపెనీ మరియు అనుసూచిలో నిర్దిష్ట పరచిన చట్టములను - పురస్కరించుకొని ఏర్పాటు చేయబడిన కంపెనీ లేక కంపెనీలను కూడా ఈ చట్టము క్రింద లైసెన్సుదారులుగా భావించవలెను.

అంతేకాక, సముచిత కమీషను, ఈ చట్టము క్రింది. ఇతర షరతులు లేక ఆపేక్షితము లకు భంగము కలుగకుండ, ఒకే ప్రాంతములో లైసెన్సు మంజూరు కొరకు దరఖాస్తుదారుడు కేంద్ర ప్రభుత్వముచే విహితపరచబడునట్టి (తగినంత మూలధనము. పరపతి యోగ్యత లేక ప్రవర్తనా నియమావళికి సంబంధించిన). అదనపు అపేక్షితములను పాటించవలెనను షరతులకు లోబడి ఒక ప్రాంతములో తమ స్వంత పంపిణీ వ్యవస్థ ద్వారా విద్యుచ్ఛక్తి పంపిణీ కొరకు ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ వ్యక్తులకు కూడా లైసెన్సును మంజూరు చేయ వచ్చును, మరియు లైసెన్సు మంజూరు కొరకైన ఆ పేక్షితములన్నియు పాటించిన ఏ దరఖాస్తుదారుడికి, అదే ప్రాంతములో అటువంటి ప్రయోజనము నిమిత్తము ఇదివరకే లైసెన్సుదారుకి లైసెన్సు ఇవ్వడం జరిగిందను కారణము పై లైసెన్సుమంజూరీని తిరస్కరించరాదు.

అంతేకాక, "పంపిణీ లైసెన్సుదారుడు తన సరఫరా ప్రాంతములోని ఒక నిర్దిష్టప్రాంతమునకు ఇతర వ్యక్తి ద్వారా విద్యుచ్ఛక్తి పంపిణీని చేపట్టుటకు ప్రతిపాదించిన యెడల ఆ వ్యక్తి, సంబంధిత రాజ్య కమీషను నుండి ఏదేని ప్రత్యేక లైసెన్సును తీసుకొన వలసిన అవసరం కూడా ఉండదు. మరియు అట్టి పంపిణీ లైసెన్సుదారు, తన సరఫరా ప్రాంతములో ఈ విద్యుచ్ఛక్తి సరఫరా కొరకు బాధ్యత వహించవలేను.