పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________ 14/ G16

భాగము -4

లైసెన్సు లిచ్చుట

12. ఏ వ్యక్తిగాని, 14వ పరిచ్చేదము క్రింద లైసెన్సు ద్వారా అట్లు చేయుటకు ఆతడికి ప్రాధికార మీయబడిననే లేక 13వ పరిచ్ఛేదము క్రింద అతడు మినహాయింపబడిననే తప్ప.-

(ఎ) విద్యుచ్ఛక్తి ప్రసారమును చేపట్టరాదు; లేదా
(బి) విద్యుచ్ఛక్తి పంపిణీని చేపట్టరాదు; లేదా

{(సి) విద్యుచ్ఛక్తి వర్తకమును చేపట్టరాదు

13. సముచిత కమీషను, సముచిత ప్రభుత్వము. చేసిన సిఫారసు పై, 5వ పరిచ్చేదము క్రింద రూపొందించిన జాతీయ విధానముననుసరించి మరియు ప్రజాహితమును దృష్టిలో పెట్టుకొని, ఏవేని షరతులు మరియు నిర్బంధనలు ఏవేనియున్నచో వాటికి లోబడి అధి సూచన ద్వారా, అందులో నిర్దిష్ట పరచబడునట్టి కాలావధి లేక కాలావధులకు 12వ పరిచ్ఛేదము యొక్క నిబంధనలు, ఏదేని స్థానిక ప్రాధికార సంస్థ, పంచాయితీ సంస్థ, వినియోగదార్ల అసోసియేషను, సహకార సంఘములు, ప్రభుత్వేతర వ్యవస్థలు లేక ఫ్రాంచైజీలకు వర్తించవని ఆదేశించవచ్చును.

14. సముచిత కమీషను, 15వ పరిచ్ఛేదము క్రింద తనకు చేయబడిన దరఖాస్తు పై,

(ఎ) ప్రసార లైసెన్సుదారుగా విద్యుచ్ఛక్తి ప్రసారము చేయుటకు; లేక
(బి) పంపిణీ లైసెన్సుదారుగా విద్యుచ్ఛక్తి పంపిణీ చేయుటకు, లేక
(సి) విద్యుచ్ఛక్తి వర్తకుడిగా విద్యుచ్ఛక్తి వర్తకమును చేపట్టుటకు

లైసెన్సులో నిర్దిష్ట పరచబడునట్టి ఏదేని ప్రాంతములో ఎవరేని వ్యక్తికి లైసెన్సును ఆ మంజూరు చేయవచ్చును.

అయితే, నియత తేదీన లేక దానికి ముందు రద్దు చేయబడిన శాసనము లేక అనుసూచిలో నిర్దిష్ట పరచిన ఏడేని, చట్టము యొక్క నిబంధనల క్రింద విద్యుత్ ప్రసార లేక సరఫరాల వ్యాపారం చేయుచున్న ఎవరేని వ్యక్తి, రద్దు చేసిన శాసనములు లేక అనుసూచిలో నిర్దిష్ట పరచినట్టి చట్టము క్రింద అతనికి మంజూరు చేయబడిన లైసెన్సు, క్లియరెన్సు లేక ఆమోదములో నిర్ణయించబడునట్టి కాలావధికి ఈ చట్టము క్రింద లైసెన్సుదారుగా భావించబడవలెను, మరియు అట్టి లైసెన్సుకు సంబంధించి రద్దు చేసిన శాసనములు లేక అనుసూచిలో నిర్దిష్టపరచినట్టి చట్టము యొక్క నిబంధనలు ఈ చట్టము ప్రారంభమైన తేదీ నుండి ఒక సంవత్సరవు కాలావధి వరకు లేక లైసెన్సుదారు అభ్యర్ధన పై సముచిత కమీషనుచే అంతకు ముందే నిర్దిష్టపరచబడునట్టి కాలావధికి వర్తించవలెను. మరియు ఆ తరువాత సదరు. వ్యాపారానికి ఈ చట్టపు నిబంధనలు వర్తింపజేయవలేను.