పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________ - - 114/0112 సెషన్సు న్యాయస్థానముగా భావింపబడవలెను మరియు సెషన్సు న్యాయస్థానము యొక్క అన్ని అధికారములను కలిగియుండును. మరియు ప్రత్యేక న్యాయస్థానము సమక్షమున అభియోగమును నడుపు వ్యక్తి పబ్లికు ప్రాసిక్యూటరుగా భావింపబడవలెను.

156. క్రిమినలు ప్రక్రియాస్మృతి, 1973 యొక్క 29 మరియు 30వ అధ్యాయములచే ఒసగబడిన అధికారములన్నింటిని వాటిని వర్తింపజేయదగినంత మేరకు ఉన్నత న్యాయస్థానము అధికరితా పరిధి యొక్క స్థానిక హద్దులలో యున్న ప్రత్యేక న్యాయస్థానము ఉన్నత న్యాయ స్థానపు అధికారితా పరిధి యొక్క స్థానిక హద్దుల లోపల కేసుల విచారణ జరుపుతున్న జిల్లా న్యాయస్థానము లేదా సందర్భానుసారంగా సెషన్ను న్యాయస్థానమువలె వినియోగించ వచ్చును.

157. ప్రత్యేక న్యాయస్థానము, దరఖాస్తు పైగాని లేదా ఇతర విధంగాగాని మరియు న్యాయ విఘాతమును నివారించుటకుగాను 154వ పరిచ్ఛేదము క్రింద జారీ చేసిన తీర్పు లేదా ఉత్తర్వును పునర్విలోకనము చేయవచ్చును. అయితే, సంగతి విషయక సొరపాటు, ముఖ్య సంగతులు తెలియక పోవడం లేదా రికార్డును బట్టి తేటతెల్లమయ్యే తప్పు క్రింద అది జారీ చేయబడినట్టి ఉత్తర్వు అనే ఆధారముపై తప్ప, అట్టి పునర్విలోకన దరఖాస్తును స్వీకరించరాదు.

అయితే, ప్రత్యేక న్యాయస్థానము, ప్రభావితమైన పక్షకారుల వాదనలు ఆకర్షించకుండా ఏదేని పునర్విలోకన దరఖాస్తును అనుమతించరాదు మరియు తన యొక్క పూర్వపు ఉత్తర్వు లేదా తీర్పును రద్దు చేయరాదు.

విశదీకరణ:- ఈ భాగము నిమిత్తం “ప్రత్యేక న్యాయస్థానములు" అనగా 153వ పరిచ్చేదపు ఉప పరిచ్ఛేదము (1) క్రింద సంఘటితము చేయబడిన ప్రత్యేక కోర్టులు అని అర్ధము;

భాగము - 16

వివాద తీర్మానం

మధ్యవర్తిత్వము

158. ఈ చట్టము క్రింద లేదా దానిచే ఏదేని విషయమును మధ్యవర్తిత్వం ద్వారా నిర్ధారించుటకు ఉత్తర్వు చేసిన యెడల, ఆ విషయమును, లైసెన్సుదారు యొక్క లైసెన్సులో ఇతరవిధంగా అభివ్య క్తముగా నిబంధించబడిననే తప్ప, ఇరు పక్షకారుల దరఖాస్తు పై ఆ విషయమై సముచిత కమీషనుచే నామనిర్దేశము చేయబడినట్టి వ్యక్తి లేదా వక్తులచే నిర్ధారించ వలెను; కాని అన్ని ఇతర విషయములలో మధ్యవర్తిత్వము మరియు సంధాన చట్టము, 1996 యొక్క నిబంధనలకు లోబడి మధ్యవర్తిత్వము ఉండవలెను.