పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

భాగము - 17

ఇతర నిబంధనలు

సంరక్షక ఖండములు.

159. ఏ వ్యక్తి, విద్యుచ్ఛక్తి యొక్క ఉత్పాదకత, ప్రసారము, పంపిణీ, సరఫరా, లేదా ఉపయోగములో స్థానిక ప్రాధికార సంస్థలో నిహితమైయున్న లేదా దానిచే నియంత్రించ బడియున్న ఏదేని రైల్వే, రహదారి, విమానాశ్రయాలు, ట్రామ్ వే, కాలువ లేక జలమార్గం లేదా ఏదేని డాకు, రేవు లేదా ఓడ చేరు వంతెనలను ఏవిధంగానైనను హాని చేయరాదు లేదా ఏదేని రైల్వే, వాయు మార్గం. ట్రామ్ మార్గం, కాలువ లేదా జలమార్గం పై రాకపోకలకు అవరోధం కలిగించరాదు లేక జోక్యం చేసుకొనరాదు.

160.(1) విద్యుచ్ఛక్తిని ఉత్పాదకత, ప్రసారము, పంపిణీ, సరఫరా లేదా ఉపయోగించుచున్న (ఇందు ఇటు పిమ్మట ఈ పరిచ్ఛేదములో "ఆపరేటరు" అని పిలువబడు) ప్రతియొక వ్యక్తి తన విద్యుత్ లైన్లు, విద్యుచ్ఛక్తి ప్లాంటు మరియు ఇతర పనులను నిర్మించుటలో, చేయుటలో మరియు ఉంచుటలోను మరియు తన వ్యవస్థ పనితీరులో టెలిగ్రాఫిక్, టెలిఫోను లేదా విద్యుత్ సిగ్నలింగు సందేశం నిమిత్తం ఉపయోగించిన ఏదేని వైరు లేదా లైను యొక్క పని లేదా అట్టి వైరు లేదా లైనులోని విద్యుత్ ప్రవాహంనకు చేర్చడం ద్వారా లేదా ఇతర విధంగా ఆట్లు హానికరం ప్రభావితము కాకుండునట్లు సరియైన, ముందు జాగ్రత్తలు తీసుకొనవలెను.

(2) ఆపరేటరు ఉప పరిచ్చేదము (1) ఉల్లంఘన చేసినచో అతని విద్యుచ్ఛక్తి లైన్లు, విద్యుచ్ఛక్తి ప్లాంటు లేదా ఇతర పనులను నిర్మించిన, వేసిన లేదా ఉంచిన అతని యొక్క వ్యవస్థ పనితీరు విషయమై లేదా ఏదేని వైరు, లైను లేదా విద్యుచ్ఛక్తి ప్రవాహము వలన హానికరంగా లేదా హానికరంగా కాకుండా ప్రభావితమైన విషయమై ఆప రేటరు మరియు టెలిగ్రాఫు ప్రాధికార సంస్థ మధ్య ఏదేని భేదము లేదా వివాదము తలెత్తిన యెడల, ఆ విషయములను కేంద్ర ప్రభుత్వమునకు నిర్దేశించవలెను. మరియు కేంద్ర ప్రభుత్వము, అట్టి లైన్లు, ప్లాంటు లేదా పనుల నిర్మాణము తరువాత విద్యుత్ లైన్లు, విద్యుత్ ప్లాంటు లేదా ఆపరేటరు యొక్క పనులకు అనుచితమైనంత దగ్గరగా వైరు లేదా లైను ఉంచబడినాయని భావించిననే తప్ప, ఈ పరిచ్ఛేదము యొక్క నిబంధనలను అమలు చేయుటకుగాను అతని వ్యవస్థలో మార్పులు లేదా వ్యవస్థకు చేర్పులు చేయుటకు ఆప రేటరును ఆదేశించవచ్చును మరియు ఆప రేటరు తదనుసారంగా అట్టి మార్పులు లేదా చేర్పులు చేయవలెను.