పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

108 6108

152.(1) క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973లో ఏమి ఉన్నప్పటికినీ, సముచిత ప్రభుత్వము లేదా ఈ విషయములో ప్రాధికారమీయబడిన ఎవరేని అధికారి, ఈ చట్టము క్రింద శిక్షింపదగు విద్యుత్ చౌర్య, అపరాధమును చేసిన లేక చేసినట్లు సబబుగా అనుమానించుటకు వీలున్న ఎవరేని వినియోగదారుడు లేక వ్యక్తి నుండి ఈ క్రింది పట్టికలో నిర్దిష్టపరచబడిన పైకమును అపరాధముల రాజీ ద్వారా అంగీకరించవచ్చును.

పట్టిక
సర్వీసు స్వభావము ఒక కిలోవాట్ (కె.డబ్ల్యూ)/హార్స్ పవరు (హెచ్.పి)కు వసూలు చేయవలసిన రాజీ పైకము మొత్తము యొక్క రేటు లేదా లోటెన్షను (ఎల్.టి) సరఫరా కొరకు మరియు హైటెన్షను( హెచ్.టి) కొరకు కాంట్రాక్టు డిమాండు యొక్క ఒక కిలో వోల్ట్ యాంపియర్ (కె.వి.ఏ)కు అందులో భాగము.
(1) (2)
(1) పారిశ్రామిక సర్వీసు ఇరవై వేల రూపాయలు;
(2) వాణిజ్య సర్వీసు పది వేల రూపాయలు:
(3) వ్యవసాయ సర్వీసు రెండు వేల రూపాయలు:
(4) ఇతర సర్వీసులు నాలుగు వేల రూపాయలు.

అయితే, సముచిత ప్రభుత్వము అధికారిక రాజపత్రములో అధిసూచన ద్వారా పై పట్టికలో నిర్దిష్ట పరచబడిన రేట్లను సవరించవచ్చును.

(2) ఉప పరిచ్చేదము (1) ప్రకారం పైకము మొత్తం చెల్లించిన మీదట, సదరు అపరాధము నకు సంబంధించి అభిరక్షలోనున్న ఎవరేని వ్యక్తి విడుదల చేయబడవలెను మరియు అట్టి వినియోగదారుడు లేదా వ్యక్తికి వ్యతిరేకముగా ఏదేని క్రిమినలు న్యాయ స్థానములో ఎటువంటి ప్రొసీడింగులను ప్రారంభించరాదు. లేదా కొనసాగించరాదు.

(3) సముచిత ప్రభుత్వము లేదా ఈ విషయముమై అధికారమీయబడిన అధికారిచే ఉప-పరిచ్చేదము (1) ప్రకారం అపరాధములు రాజీ కొరకై అంగీకరింపబడిన పైకము మొత్తమును క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 యొక్క 300వ పరిచ్ఛేదపు అర్ధములోని దోష విముక్తి కైన మొత్తముగా భావింపబడవలెను.

(4) ఉప-పరిచ్చేదము (1) క్రింద అపరాధముల రాజీని ఎవరేని వ్యక్తి లేదా వినియోగదారుని కొరకు ఒకసారి మాత్రమే అనుమతింపబడవలెను.