పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/109

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


________________

- 1171 G107 చేసినచో అట్టి దుష్ప్రరణ కొరకు అతనిపై ఉన్న నేరస్థాపన ఈ చట్టము క్రింద చేయబడిన లేదా చేసినట్లు భావించబడిన నియమముల క్రింద జారీ చేయబడిన లైసెన్సును లేదా సమర్ధ్యతా ధృవీకరణ పత్రము లేదా అనుమతి లేదా అట్టి ఇతర ప్రాధికృతమును లైసెన్సు ప్రాధికారి రద్దు చేయవచ్చును.

అయితే, విన్నవించుకొనడానికి అట్టి వ్యక్తికి సబబైన అవకాశమీయకుండా అట్టి రద్దు కొరకు ఉత్తర్వును చేయరాదు.

విశదీకరణ:- ఈ ఉప-పరిచ్ఛేదము నిమిత్తం, "లైసెన్సు ప్రాధికారి" అనగా తత్సమయమున అధికారములో ఉండి అట్టి లైసెన్సు లేదా సామర్ధ్యతా ధృవీకరణ పత్రము లేదా అనుమతి లేదా అట్టి ఇతర ప్రాధికృతమును జారీచేయు లేదా నవీకరించు అధికారి అని అర్ధము:

151. సముచిత ప్రభుత్వము లేదా సముచిత కమీషను లేదా వారిచే ప్రాధికార మీయబడిన ఎవరేని వారి అధికారి లేదా ముఖ్య విద్యుత్ ఇన్స్ పెక్టరు లేదా విద్యుత్ " ఇన్ స్పెక్టరు లేదా లైసెన్సుదారు లేదా సందర్భానుసారముగా ఉత్పాదక కంపెనీ యొక్క వ్రాతమూలకమైన ఫిర్యాదు పై తప్ప ఈ ప్రయోజనము నిమిత్తం ఈ చట్టము క్రింద శిక్షించదగు ఏదేని అపరాధమును ఏ న్యాయస్థానముగాని సంజ్ఞానము చేయరాదు.

అయితే, క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973లోని 173వ పరిచ్ఛేదము క్రింద దాఖలు చేసిన పోలీసు అధికారి యొక్క నివేదికపై ఈ చట్టము క్రింద శిక్షించదగు ఏదేని అపరాధ మును న్యాయస్థానము కూడ సంజ్ఞానములోనికి తీసుకొనవచ్చును.

అంతేకాకుండా, 153న పరిచ్ఛేదము క్రింద ఏర్పాటు చేయబడిన ప్రత్యేక న్యాయస్థానము విచారణ కొరకు అభియుక్తుడిని పంపించకున్నప్పటికిని అపరాధమును సంజ్ఞానములోనికి తీసుకొనుటకు సమర్థత కలిగియుండును.

151ఏ. ఈ చట్టము క్రింద శిక్షించదగు అపరాధము యొక్క దర్యాప్తు నిమిత్తము క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973లోని XIIవ అధ్యాయములో నిబంధించబడినట్టి అన్ని అధికారములను పోలీసు అధికార కలిగియుండవలెను.

151బీ. క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973లో ఏమున్నప్పటికివి, పరిచ్ఛేదములు 135 నుండి 140 వరకు లేదా 150వ పరిచ్ఛేదము క్రింద శిక్షించదగు అపరాధము సంజేయమైనది. మరియు జామీనుకు అయోగ్యమైనదైయుండును.