పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

- 1061 G106 అయితే, అట్టి ఎవరేని వ్యక్తి తనకు తెలియకుండా అపరాధము జరిగినదని లేక అట్టి అపరాధము జరుగుటను నివారించుటకు తాను తగిన శ్రద్ధ అంతయు తీసికొనినట్లు అతను రుజువు చేసినచో, ఈ ఉప-పరిచ్ఛేదములో నున్నదేదియు అతనిని ఏ శిక్షకు గురిచేయదు.

(2). ఉప-పరిచ్ఛేదము (1)లో ఏమి ఉన్నప్పటికినీ, ఈ చట్టము క్రింద ఏదేని అపరాధమును ఒక కంపెనీ చేసియుండి, ఆ అపరాధము. ఆ కంపెనీ యొక్క ఎవరేని డైరెక్టరు, మేనేజరు, కార్యదర్శి, లేక ఇతర అధికారి సమ్మతితో లేక మౌనానుకూలతతో జరిగినదని లేక ఏదేని నిర్లక్ష్యము వలన జరిగినదని రుజువైన యెడల ఆ డైరెక్టరు, మేనేజరు, కార్యదర్శి లేక ఇతర అధికారి కూడ అట్టి ధోషాయుత అపరాధము చేసినట్లు భావించబడవలెను మరియు తదనుసారముగా చర్యలు జరుబడి శిక్షింపబడుటకు పాత్రుడగును.

విశదీకరణ: - ఈ పరిచ్ఛేదము నిమిత్తము,-

(ఎ) "కంపెనీ" అనగా నిగమ నికాయము అని అర్ధము మరియు ఈ పదపరిధియందు ఫర్ము లేదా ఇతర వైయుక్తిక వ్యక్తుల అసోసియేషను, మరియు

(బి) ఫర్ముకు సంబంధించి "డైరెక్టరు" అనగా ఆ ఫర్ములోని భాగస్వామి

అని అర్ధము.

150.(1) భారత శిక్షా స్మృతిలో ఏమున్నప్పటికినీ, ఈ చట్టము క్రింద శిక్షింపదగు అపరాధమునకు దుష్ప్రరణ కలిగించు వారెవరైననూ ఆ అపరాధమునకై నిబంధించబడిన శిక్షతో శిక్షింపబడవలెను.

(2) ఈ చట్టము క్రింద లేదా తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనము క్రింద విధింపవలసిన ఏదేని శాస్త్రి లేదా జుర్మానాకు లేక ప్రారంభించవలసిన అభియోగపు ప్రొసీడింగులకు భంగము కలుగకుండా, ఎవరేని అధికారి లేదా బోర్డు యొక్క ఇతర ఉద్యోగి లేదా లైసెన్సుదారు. ఏదేని చర్య లేదా సనిని చేయుటకు, చేయకుండా ఉండుటకు, అనుమతి ఇచ్చుటకు, రహస్యంగా ఉంచుటకు లేదా మౌనానుకూలతతో ఏదేని కరారు చేసికొనుటతో ఏదేని విద్యుచ్ఛక్తి చౌర్యం జరిగినప్పుడు, మూడు సంవత్సరముల దాకా ఉండగల కాలావధికి కారావాసముతోను లేదా జుర్మానాతోను లేదా రెండింటితోను, శిక్షింపబడవలెను.

(3) 135వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1)లో, 136వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1)లో, 137వ పరిచ్ఛేదము మరియు 138వ పరిచ్ఛేదములో ఏమి ఉన్నప్పటికిని, ఎవరేని వ్యక్తి విద్యుచ్ఛక్తి కాంట్రాక్టరు, పర్యవేక్షకుడి లేదా కార్మికుడి కార్యకారిగా ఉన్నప్పుడు 135వ పరిచ్చేదపు ఉప-పరిచ్చేదము (1), 136న పరిచ్చేదపు ఉప-పరిచ్ఛేదము (1), 137వ పరిచ్చేదము లేదా 138వ పరిచ్చేదము క్రింద శిక్షించబడు అపరాధము చేయుట దుష్ప్రరణ