పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66 రాధికాసాంత్వనము

బెంతనిరూఢ మెంతనయ మెంతమనోజ్ఞత యెంతఠీవి నా
యంతటిమందభాగ్య కిక నంతటిచక్కనిదేవుఁ డబ్బునే. 112

సీ. నేను ముద్దులు పెట్టఁ దాను ముద్దులు పెట్టి
తెఱవ నీదుఋణంబు దీరె ననును
నేను గెమ్మో వానఁ దాను గెమ్మో వాని
వెలఁదిరో విందుకు విందె యనును
నేను జెక్కిలి నొక్కఁ దాను జెక్కిలి నొక్కి
విరిబోణి వీడుకు వీడె యనును
నేను గౌఁగిటఁ జేర్పఁ దాను గౌఁగిటఁ జేర్చి
మెలఁతరో మేరకు మేర యనును
తే. [1]రతుల సే నేలఁ దా సమరతుల నేలి
సారసాక్షిరొ యిది మారుబేర మనును
చిన్ని చిన్నారివెన్నుఁడు సేయుచిన్నె
లెన్ని యె న్నని తలపోతు నేమి సేతు. 113

సీ. కెమ్మోవి యానకు గేలి సేయుదు రంటె
గజిబిజి మొనపంట గంటి సేయుఁ
గురులు ప ట్టీడ్వకు గుట్టు దక్క దటంటె
చీకాకుగాఁ దీసి చిక్కు పఱచు
జిగిగుబ్బ లంటకు సిగ్గు పోవు నటంటె
క్రొత్తనెత్తురు గ్రమ్మ గోరు లుంచుఁ
బరులు రాఁ గలరు లే వడిగ నేలు మటంటె
జూముల తరబళ్లఁ బ్రేమ నేలుఁ
తే. బలుక వ ల్దనఁ బావురాపలుకు పలుకుఁ
గిలకిలను నవ్వవ ల్దనఁ గేక వేయు

  1. రతుల నే నేలఁగా నను రతుల నేలి [మూ.]