పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62 రాధికాసాంత్వనము

తే. కాలమహిషాధిరూఢతఁ గదలి వచ్చి
కిరణపాశమ్ములఁ దగిల్చి విరహిజనుల
[1]డాసి తీసెదు ప్రాణముల్ దోసకారి
రాజవా నీవు యమధర్మరాజు గాని. 91

క. తమ్ములకును గొడుకునకును
సమ్మతి గానట్టిరజనిచరుఁడవు గావా
యిమ్మహి రావణదితిజుల
నమ్మక్కరొ మించి తౌర యత్రికుమారా. 92

తే. గురుసతిని బట్టి విప్రయోగులను గొట్టి
తమ్ముల నడంచి పక్షపాతము ఘటించి
కాలగతి నుండి యిదెరాజగట్టునుండి
పడె దధోగతి రౌరవప్రాప్తిఁ జెంది. 93

చ. తనుఁ గొనువారినిం గొనుచు ధర్మము దప్పక కాలకూటమున్
మును గళమం దడంచికొని మూర్ఖత ని న్శిరసావహింపఁగాఁ
బునుకకళాస మెమ్ములను బూదియుఁ బూని తలేఱుఁ బట్టి మే
నును సగ మయ్యు మూలఁ బడె నుగ్రుఁ డుదగ్రనిశాచరాగ్రణీ. 94

వ. అని మదనునిం గూర్చి యి ట్లనియె. 95

తే. విసముతోఁ బుట్టెఁ గావున విధున కకట
పద్మినుల నేచుగతి సరే భళిర నీవు
పద్మినీపద్మనేత్రులవలనఁ బుట్టి
మేనమామను బోలఁగా మేలె మదన. 96

తే. తల్లిపుట్టింటిపగవానిఁ దనరఁ జేసి
తండ్రిపేరును గైకొన్నదంటనంటి
పద్మినీజాతులను జంపఁ బగలు గంటి
వౌర నీ కిది యేమిటి మేర మార. 97

  1. గాసిఁ జేసెదవిప్పుడు దోసకారి [మూ]