ద్వితీయాశ్వాసము 63
చ. అని యనిలుం గురించి పవనా [1]పవ నాయెడఁ జేయ నాయమా
ఘన మెడలించి మారుగతిఁ గైకొనుచు న్సుమనోహరుండ వై
దినమును లంకనుండి చనుదెంచుచుఁ గొమ్మలఁ బల్మిఁ బట్టఁగా
ననఁ దగు దీవు రావణున కన్నవొ తమ్ముఁడవో యెఱుంగరా. 98
వ. అని శుకపికాదులం గురించి. 99
సీ. [2]కాని మాటనె బందిఖాననే వేయింతు
గడుసుకొక్కెరవేఁటకానిఁ గూడి
[3]పట్టి మీపు ట్టెల్లఁ బలుగాకుల కొసంగి
వే ముంతు గోపికారాముఁ గూడి
పద మెత్తి పెట్టి మీమద మెల్ల వదలింతు
మెదలనీయక నీలమేఘుఁ గూడి
జడకొద్దిఁ గొట్టి మీచెడుగంతుల నడంతు
నిస్తులశరదబ్జనేత్రుఁ గూడి
తే. యలిగి మొగ మేల నెఱఁ జేయ శుకములార
[4]విడువుఁడీ వట్టికూఁతలు పికములార
డించుఁ డటు మందగతుల రాయంచలార
నిలుపుఁ డిఁక వెఱ్ఱికేకలు నెమ్ములార. 100
వ. అని విలపించుచుండునవసరంబున. 101
చ. చిలుక వజీరుఁ డత్తరిని జిందఱవందఱఁ జేతు నంచు నా
చిలుకలకొల్కిపైఁ గదిసి చివ్వలిరవ్వ లడంగ జాతిపెం
జిలుకులకోరికోల లటుచేఁదెను దుమ్మెదనారి మ్రోయఁగాఁ
గలికిమెఱుంగుగుబ్బలను ఖంగు ఖణీలు ఖచిక్కు రింగనన్. 102
క. ఇట్లేసిన మదిఝల్లని
[5]పట్లెల్లను సడలి రాధ భయ మందుచుఁ దా