పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత దస్వాతంత్య్రోద్యమం-ముస్లింలు

ఈ మేరకు విధులకు గైర్హాజరై సభలు, సమావేశాలు జరుపుతున్న సైనికులకు ప్రజానీకం మద్దతు లభించటంతో తిరుగుబాటు ఉసదృతరూపం దాల్చింది. బొంబాయి, కరాచి, కలకత్తా, ఢల్లీ, కొచ్చిన్, జమానగర్, అండమాన్‌ తదితర ప్రాంతాలలో తిరుగుబాటు ప్రభావం చాలా తీవ్రంగా కన్పించింది. ఆయా ప్రాంతాలలో 78 నౌకలు, 20కు పైగా స్థావరాలు పూర్తిగా సంభించాయి.బ్రిటిష్‌ పాలకులపై 1857లో తొలిసారిగా సిపాయీల తిరుగుబాటు జరిగాక, తిరిగి 1946లో సిపాయిలు తిరుగుబాటు చేయటంతో ఖంగుతిన్న బ్రిటిష్‌ ప్రబుత్వం కర్కశంగా వ్యవహరించి కాల్పులు జరిపింది. ఈ కాల్పులలో వందలాది ప్రజలు, ఉద్యమకారులు బలయ్యారు. వీరిలో అత్యధికులు ముస్లింలు కావటం విశేషం.

ఈ సంఘటనకు ముందుగా ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ లో చేరిన భారతీయ సైనికుల మీద బ్రిటిష్‌ పాలకులు జరిపిన విచారణ, విధించిన శిక్షలు కూడా రాయల్‌ ఇండియన్‌ నౌకాదళం తిరుగుబాటుకు దోహదమయ్యాయి. ఈ విచారణ సందర్భంగా జనాబ్‌ రషీద్‌ అలీకి విధించిన 7 సంవత్సరాల కారాగారవాసం, తీవ్ర విమర్శకు గురైంది. ప్రజలు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తూ కలకత్తా పట్టణంలో ఊరేగింపులు జరిపారు.

ఈ విధగా రాయల్‌ ఇండియన్‌ నౌకాదళం అధికారుల, సైనికుల తిరుగుబాటు అగ్నికి ఆజ్యం తోడైనట్లయ్యింది. బ్రిటిష్‌ పాలకుల పునాదులు పూర్తిగా కదలి పోయాయన్న దానికి ప్రబల నిదర్శనంగా నిలిచిందీ తిరుగుబాటు. ఈ తిరుగుబాటును జాతీయ కాంగ్రెస్‌, ముస్లింలీగ్ లు వ్యతిరేకించాయి. తిరుగుబాటు సైనికులు మాత్రం కలసినట్టుగా కాంగ్రెస్‌ లీగ్ ల పతాకాలను నౌకల మీద కలసి ఎగుర వేశారు. తిరుగుబాటుదారులందర్ని విదులకు హాజరు కావాల్సిందిగా జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షులు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ కోరారు. బ్రిటిష్‌ ప్రబుయత్వం తిరుగుబాటు సైనికుల మీద ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా ఆయన చూశారు.

1857 నాటి తిరుగుబాటు తీరులో ఈ తిరుగుబాటుకు ప్రజల మద్దతు లభించటంతో అగ్నికి వాయువు తోడైనట్టయ్యింది. కాంగ్రెస్‌, ముసింలీగ్ లు కూడా మద్దతు పలకటంతో 1857 నాటి ఐకమత్యం పదర్శితమైంది.1857లో తిరుగుబాటు తరువాత, ఆంగ్లేయులు మూటముల్లె సర్దుకుంటున్నప్పుడు మళ్ళీ సైనికులు తిరగబడటంతో అధికారులు ఖంగుతిన్నారు. ప్రధాన నౌకా కేంద్రాలన్నిటిలో తిరుగుబాటు ప్రభావం కన్పించింది. ఈ చర్యతో మండిపడిన అధికారులు తిరుగబడిన జవానులు, ప్రజల మీదవిచక్షణా రహితంగా కాల్పులు జరుపగా, ఆ కాల్పులలో అమరులైన వారిలో అత్యధికులు ముస్లింలు కావటం విశేషం.

61