సయ్యద్ నశీర్ అహమ్మద్
కపుర్తలా), అల్తాఫ్ హుస్సేన్ (అమృతసర్), బషీర్ అహమ్మద్ (హర్యానా-రోధక్), చిరాగుధ్ధీన్ (పంజాబ్- లూధియానా), బషీర్ అహమ్మద్ (పంజాబ్- సియాల్‌ఖొతట్), ప్రస్తుత పాకిస్థాన్ లోని జెహాలమ్‌కు చెందిన దిలావర్ ఖాన్, ఫతేఖాన్, ఫతే మహమ్మద్ (హర్యానా-రోథాక్), పతే మముహమ్మద్ (పంజాబ్-హోషియాపూర్), ఫజల్‌ఖాన్ (పాకిస్థాన-జెహలం), గులాం నబి (పంజాబ్-గురుదాస్ పూర్), ఇనాయతుల్లా (వాయవ్య సరిహద్దు రాష్ట్రం-పెషాపర్), ఇర్షాద్ అలీ (హర్యానా-రోధక్), జమాలుద్దీన్ (పంజాబ్- కపుర్తలా), ఖాశిం అలీ (హర్యానా-హిస్సార్), మహమ్మద్‌ఖాన్ (పాకిస్ధాన్ - నూర్‌పూర్), ఖుదా బక్ష్ (పాకిస్థాన్ - కాంబెల్లాపూర్), ఖాశిం అలీ (హర్యానా హిస్సార్), మహమ్మద్ ఖాన్ (పాకిస్థాన్ - నూర్‌పూర్), ఖుదా బక్ష్ (పాకిస్థాన-కాంబెల్లాపూర్), ఖుషీ ముహమ్మద్ (పంజాబ్-లూధియానా), లాల్‌ఖాన్ (పంజాబ్-జెహలం), మహమ్మద్ అబ్బాస్ (రావల్పిండి) మహ్మద్ అఫజల్ (రావల్సిండి), మహమ్మద్ అనfiర్ (పాకిస్థాన్ - నూర్‌పూర్) మహమ్మద్ బనారస్ (రావల్సింది), బసమ్దద్ తీన్( పంజాబ్-సియాల్‌కోట), మహమ్మద్ అలీ (పాకిస్థాన్- లహోర్), మహమ్మద్ షఫీ(పంజాబ్ -జలంధార్), మహమ్మద్ ఉమర్ ఖాన్ (హర్యానా-రోధాక్), మహమ్మద్ యాకూబ్ (వాయవ్యసరిహద్దు రాష్ట్రం-కోహాట్) నబీ బక్ష్ (పంజాబ్ - కపుర్తలా) నూర్ హుస్సేన్ (పంజాబ్-కాని) తదితరులు ఉన్నారు.
ఆజాద్ హింద్ ఫౌజ్‌లో వివిధపదవులు నిర్వహించి మాతృ భూమి విముక్తి పోరాటంలో పునీతులైన వందలాది వీరయోదులలో నక్కి అహ్మద్ చౌదరి, అష్రాఫ్ మండల్, అమీర్ హయత్, అబ్దుల్ రజాఖ్, ఆఖ్తర్ అలీ, మహమ్మద్ అలీషా, అటా మహమ్మద్, అహమ్మద్ ఖాన్, ఎ.కె. మీర్జా, అబూ ఖాన్, యస్. అఖ్తర్ అలీ, అహమ్మదుల్లా, అబ్దుర్ రహమాన్ ఖాన్ ఉనాflన్నారు. మన హెదారాబాదుకు చెందిన అబిద్ హసన్ సఫ్రానితో పాటుగా ఖమ్రుల్ ఇస్లాం, తాజుద్దీన్ లాంటియోధులు పలువురున్నారు.
తుది తిరుగుబాటులోనూ త్యాగాలు
భారత స్వాతంత్య్రోద్యమంలో చివరి ఘట్టంగా పేర్కొనదగినది రాయల్ ఇండియన్ నౌకాదాళం తిరుగుబాటు. 1946 ఫిబ్రవరి మాసంలో జరిగిన ఈ తిరుగుబాటు, ఆనాటి బ్రిటిష్ పాలకుల తీవ్ర జాతి వివక్షతకు నిరసనగా మారింది. వివక్షకు వ్యతిరేకంగా విజ్ఞప్తులు, మహజర్లు సమర్పించినప్పిటికి బ్రిటిష్ పాలకుల నుండి ఎటువంటి స్పందన లేకపోవటంతో విసుగు చెందిన రాయల్ ఇండియన్ నౌకాదళంలోని భారతీయ సిపాయీలు, అధికారులు ప్రత్యక్ష చర్యకు పూనుకున్నారు.
60