పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

గాంధీ-ఆజాద్‌ల నాయకత్వం

భారత జాతీయోద్యమ చరిత్రలో 1940 నుండి స్వరాజ్యం సిద్ధించేంత వరకు జరిగిన పోరాటాలకు మహాత్మాగాంధీ, మౌలానా ఆజాద్‌ల నాయకత్వం మార్గదర్శకత్వం వహించిందనవచ్చు. ప్రారంభం నుండి జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర వహించిన మౌలానా 1923లో ఢిల్లీ కాంగ్రెస్‌ సమావేశానికి అధ్యక్షత వహించారు. 1940లో రాంఘర్‌ కాంగ్రెస్‌ సమావేశంలో ఆయన జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షులుగా నియుక్తులై సుదీర్గ…కాలం కీలకపాత్ర నిర్వహించారు. ముస్లింలీగ్ రాజకీయాల వలన ఎదురయ్యే ప్రమాదాలను ఆదినుండే గ్రహించిన మౌలానా ముస్లింలను హెచ్చరిస్తూ వచ్చారు. స్వరాజ్యం కంటే హిందూ-ముస్లింల ఐక్యతకు ప్రథమ స్థానం కల్పించిన ఆజాద్‌ ద్విజాతి సిద్ధాంతాన్నివ్యతిరేకించారు. ముస్లింలీగ్, హిందూ మహాసభ, బ్రిటిష్‌ ప్రభుత్వం నుండి ఎదురవుతున్న విభజన ప్రమాదంతోపాటుగా కాంగ్రెస్‌ నేతల మధ్యగల అంతర్గత విబేదాలను ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్ని అరిష్టాలను సమరవంతంగా ఎదుర్కొన్న మౌలానా, విభజన విషయంలో మాత్రం నిస్సహాయులయ్యారు. ఈ విషయంలో గాంధీజీని ఆశ్రయించినా ఫలితం లేకుండాపోయింది. చిట్టచివరకు 1947లో జవహర్‌ లాల్‌ నెహ్రూ˙ అధ్యక్షతన ఏర్పాటైన జాతీయ కాంగ్రెస్‌ సమావేశం విభజనను అంగీకరించటంతో విభజనను నివారించానికి మౌలానా చేసిన ప్రయత్నాలన్నీ వృధాఅయ్యాయి. జాతీయవాద ముస్లింలంతా ఈ పరిణామానికి హతాశులయ్యారు.

విభజన మూల్యం ద్వారా లభించిన స్వరాజ్యం

1947 ఫిబ్రవరి 20వ తేదిన బ్రిటిషు ప్రధాన మంత్రి అట్లీ మ్లాడుతూ 1948 జూన్‌లోగా భారతదేశం నుండి తాము వైదొలగుతున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్నినిర్వహించేందుకు మౌంట్ బాటన్‌ను ఇండియాకు పంపారు. ఆయన 1947 జూన్‌ 3వ తేదిన ఓ పథకాన్నిప్రకటించాడు. మౌంటు బాటన్‌ ఇండియాను చీల్చేందుకు తొందరపడాన్ని గ్రహించిన మౌలానా వ్యాకులత చెందారు. ఇండియా విభజన ప్రతిపాదనకు క్యాబినెట్ మిషన్‌ పథకం సరైన పరిష్కారమని ఆయన భావించారు. ఇండియాలో మత సమస్య ప్రధానం కాదని, ప్రజల అభ్యున్నతి కోసం సాగాల్సిన ప్రయత్నాలు, పథకాలకు ప్రాధాన్యత నివ్యాలని ఆయన అభిప్రాయపడ్డారు. మౌలానా ద్విజాతి సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు. ఇండియా సంస్కతి

62