పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ఆ ఉరిశిక్ష్జ అమలుకు ముందురోజున ఆయనను చూడానికి వచ్చి, జైలులో విలపిస్తున్న బంధాువులతో మాట్లాడుతూ, ‘..if I am not allowed to observe the last ceremony of the noblest ordeal with all dignity and steadiness then the sanctity of the occasion will be tarnished. A sacred and great responsibility for the liberation of motherland has been entrusted to me. You should feel happy and proud that one of yours is fortunate enough to offer his...To me this is a good fortune that belonging to the Muslim community, I have acquired the privilege of following the footsteps of those great martyrs..’ (- Freedom Movement and Indian Muslims, Santimoy Ray, PPH Delhi, 1883 Page. 43) అన్నారు.

1927 డిసెంబర్‌ 19న ఉరి తీస్తారనగా, 27 సంవత్సరాల ఆ యువకుడు దేశ ప్రజలనుద్ధ్దేశించి రాసిన ఓ లేఖలో, .మీరు ఏ మతానికి, సంప్రదాయానికి చెందినవారైనా సరే దేశసేవలో సహరించండి. వృధాగా పరస్పరం కలహించకండి. ఒకవళ దారులు వేరైనా అందరి లక్ష్యంఒకటే. అన్ని పనులు ఒకే లక్ష్యాన్ని సాధించేందుకు సాధానాలు. అలాంటప్పుడు ఈ వ్యర్థపు క్లొాటలూ, కుమ్ములాటలు ఎందుకు? ఐకమత్యంతో దేశంలోని దొరతనాన్నిఎదిరించండి. దేశాన్ని స్వతంత్రం చేయండి..' అన్నారు.

చివరకు నా మాతృభూమి నిత్యం స్వతంత్రంగా ఉండాలి. నాదేముంది నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటూ మాతృభూమి స్ధభాగ్యాన్ని అనుక్షణం కాంక్షిస్తూ అమరలోకాలకు వెళ్ళిపోయారు.('..Hamaara watan rahe sadaa khayam aur aajad, hamara kya, ham rahe, rahe, narahe..').

ఈ సందర్భంగా, ఒక ముస్లిం యువకుడిలా అమరుడయ్యే అవకాశం రావడం, ఆ సౌభాగ్యం నాకే కలగడం నిజంగా ఎంతో గర్వకారణం, అని అంన్నారు. (బిస్మిల్‌ ఆత్మకథ, శ్రీరాంప్రసాద్‌ బిస్మిల్‌, ఆనువాదం: ఇంగువ మల్లికార్జున శర్మ, మార్కిస్టు ఆధ్యయన వేదిక, హైదారాబాదు, 1989, పేజి.153)

అగ్నియుగం రెండవ దశలో జుగాంతర్‌ పార్టీకి చెందిన మౌల్వీ గయాజుద్దీన్‌, నశీరుద్దీన్‌ అహ్మద్‌, అబ్దుల్‌ ఖాదిర్‌, అనుశీలన పార్టికి చెందిన అల్తాఫ్‌ అలీ, మహమ్మద్‌ ఇస్మాయిల్‌, జహీరుద్దీన్‌ తదితర విప్లవకారులు ఎందరో పలు ప్రాంతాలలో విస్పులింగాలై విజృంభించారు.

46