పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతస్వాతంత్య్రోద్యమం-ముస్లింలు

మన్యం పోరులో రాజు అండగా నిలచిన ఫజులుల్లా ఖాన్‌

ఆంధ్రప్రదేశ్‌లో 1922-24 లో జరిగిన మన్యం పోరాటానికి నాయకత్వం వహించిన అల్లూరి సీతారామరాజుకు డిప్యూ కలక్టర్‌ ఫజులుల్లా ఖాన్‌ ప్రేరణగా నిలిచారు. ఆయన రాజు తండ్రి స్పేహితులు. ఆ కారణంగా పుత్రవాత్సల్యంతోబ్రిటిష్‌ ప్రబుత్వంలో ఉన్నతాధికారి అయిఉండి అరవై ఎకరాల భూమి కేటాయించిన ఫజులుల్లా ఖాన్‌ శ్రీ రాజుకు సహకరించారు. ఈ విషయాలు 1930లో రాసిన ' అల్లూరి సీతారామరాజు ' లో ఆ పుస్తక రచయిత శ్రీ పొన్నలూరి రాధాకృష్ణమూర్తి పేర్కొన్నారు. ఆ విషయాలను విస్తారంగా రాస్తూ, '.. యా భానుని ( అల్లూరి ) తీవ్ర గమనమునకు రధసారధ్యామును వహించవలసిన శ్రీయుత ఫజులుల్లా ఖాను గారు మృత్యశయ్య పైనున్నారు.... పిదప అనతికాలంలోనే ఖానుగారు స్వగస్తులైరి...ఖానుగారు మరి కొంతకాలం జీవించియున్నచో ఆయన కంఠానికి ఉరిబెట్టిప్రబుత్వము (బ్రిటిషు ప్రబుత్వం) తన ఆగ్రహమును లోకమునకు ప్రకటించేది..ఇంతకు ఫజులుల్లా ఖాను దేశబక్తి మరుగున పడినది..', అని శ్రీ పొన్నలూరి పేర్కోన్నారంటే, అల్లూరి పితూరిలో ఫజులుల్లా ఖాన్‌ భాగస్వామం ఎటువంటిదో గ్రహించవచ్చు. ఏ కారణంగానో జనాబ్‌ ఫజులుల్లా ఖాన్‌ పాత్ర తగినంత ప్రచారానికి నోచుకోలేదు.

ఈవిధంగా సాగిన సాయుధ పోరాటాలలో జుగాంతర్‌ పార్టీకి చెందిన మౌల్వీ గయాజుద్దీన్‌ అహమ్మద్‌, నశీరుద్దీన్‌ అహమ్మద్‌, ఆయన కుమార్తె రజియా ఖాతూన్‌, అబ్దుల్‌ ఖాదీర్‌, అనుశీలన పార్టీకి చెందిన అల్తాఫ్‌ అలీ, ముహమ్మద్‌ ఇస్మాయీల్‌, జహీరుద్దీన్‌ తదితరులు ఆయా విప్లవ పార్టీలలో బాధ్యులుగా ప్రముఖ పాత్ర వహించారు.

స్వరాజ్య పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యం

ఆ సమయంలో రాజకీయరంగాన ఏర్పడిన పరిస్థితిని సమీక్షించేందుకుగాను హకీం అజ్మల్‌ ఖాన్‌ అధ్యక్షతన విచారణ కమిటీ ఏర్పాటయ్యింది. విచారణానంతరం 1919 రాజ్యాంగం ప్రకారం ఎన్నికలలో పాల్గొనాలని ఒక వర్గం, అవసరం లేదని మరొక వర్గం అభిప్రాయపడటంతో చీలిక ఏర్పడింది. ఈ చీలిక పండిత మోతీలాల్‌ నెహ్రూ˙ నాయకత్వంలో స్వరాజ్య పార్టీ నిర్మాణానికి కారణమయ్యింది. ప్రముఖ ముస్లిం నాయకులు హకీం అజ్మల్‌ ఖాన్‌ పార్టీ వ్యవస్థాపకులలో ఒకరయ్యారు. ఈ పార్టీ

47