పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

ప్రజలు, వివిధ జనసముహాలు కలసికట్టుగా ఆయన వెంట నడిచారు. ఆ కారణంగా అతిత్వరలో ఈ పోరాటం పలు ప్రాంతాలకు వ్యాపించింది. 1830 నుండి 1900 వరకు సాగిన ఈ పోరాటంలో దూదు మియాకు వారసులుగా నోయామియా, బనీ అమీర్‌ మియా తదితరులు భాగస్వామ్యం వహించారు.

ఈ పోరాటాలు చాలా వరకు ప్రారంభదశలో మతం పునాదుల మీద, మత సంస్కరణల లక్ష్యంగా ఆరంభమై నప్పిటికీ వలస పాలకుల దోపిడకి ప్రజలు గురికావటం గమనించి తమ దశను-దిశను మార్చుకుని, పరాయి పాలకుల దాస్యం నుండి ప్రజలకు విముక్తి కలుగచేయాలన్న విసృత లక్ష్యంతో కంపెనీ పాలకులు, ఆ పాలకుల తొత్తులమీదా తిరుబాటుకు బాటలు వేశాయి. ఈ తిరుగుబాటు సమయంలో మతంతో ప్రసక్తిలేకుండ ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారంతా ఆ యోధుల ఆగ్రహానికి బలికావటం విశేషం. ఆ తరువాత బ్రిటీష్‌ పాలకులను తరిమికొట్టేందుకు సాగిన పలు తిరుగుబాట్లకు ప్రేరణగా నిలచి స్వేచ్ఛా-స్వాతంత్య్రాలకు ఈ పోరాలు బాటలు వేశాయి. బ్రిటీష్‌ పాలన మీద విచ్చుకత్తులతో విరుచుక పడి అగ్నియుగాన్ని సృష్టించిన, విప్లవకారులకు మార్గదార్శకం కావటమేకాకుండ స్పూర్తిదాయకంగా నిలిచినందున ఆ పోరాట వీరులను స్మరించని స్వాతంత్య్రోద్యమ చరిత్ర అసంపూర్ణం.

బ్రిటీషర్ల పాలిట భయంకరుడు టిపూ

బ్రిటీష్‌ పాలకుల రాజ్య విస్తరణ కాంక్షను గుర్తించిన టిపూ సుల్తాన్‌ ముంచుకు రానున్న ప్రమాదం గురించి సమకాలీన పాలకులను హెచ్చరించారు. టిపూ సుల్తాన్‌గా ఖ్యాతిగాంచిన ఫతే ఆలీ మైసూర్‌ సామ్రాజ్యాధినేత. టిపూ సుల్తాన్‌ బ్రిటీష్‌ పాలకుల కుట్రలు కుయుక్తులను పసిగట్టిన ఆయన ఆ విషయాలను వివరిస్తూ 1780 దశకంలోనే స్వదేశీపాలకులకు అనేక ఉత్తరాలు రాశారు. బ్రిటీష్‌ పాలకుల ఎత్తులను చిత్తు చేస్తూ వీరోచితంగా పోరాడుతూ స్వదేశీ పాలకుల్ని తనతో కలసి రావాల్సిందిగా కోరారు. ముందుచూపు లేని స్వార్ధపరు లైన పాలకులు టిపూ హెచ్చరికలను ఖాతరు చేయకపోగా, బ్రిటీష్‌ పాలకులకు తొత్తులుగా మారారు. 'స్వదేశీ పాలకులు

18