పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం :ముస్లింలు


బొంబాయి, మధ్యప్రదేశ్‌, హైదారాబాద్‌లలో కూడ ఈ ఉద్యమానికి కార్యకర్తలు, మద్దతుదార్లు ఏర్పడ్డారు. అప్పిటి హైదారాబాదు నవాబు సోదరుడు ముబారిజుద్దౌలా వహాబీ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించారు. బ్రిటీష్‌ రాణికి వ్యతిరేకంగా కుట్ర పన్నాడన్ననేరారోపణగావించి, ముబారిజుద్దౌలాకు జీవిత ఖైదు విధించారు. ఆయన అనుచరులు మరో పదిమంది పది సంవత్సరాలకు పైబడిన జైలు శిక్షలకు గురయ్యారు. చిట్టచివరకు ముబారిజుద్దౌలా గోల్కొండలో అమరత్వం పొందారు. బ్రటీష్‌ సామ్రాజ్య విస్తరణ కాంక్షను గుర్తించిన ఈ పోరాటాలన్నీ, ప్రజలమీద సాగుతున్నఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా ప్రారంభమై, బ్రిటీష్‌ వలస పాలకుల వైపునకు మళ్ళాయి. ఈ పోరాటాలచే స్పూర్తి పొందిన ప్రజలు, ప్రధానంగా యువకులు 1857 నాటి ప్రథామ స్వాతంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.

ఈ పోరాటంలో అనేక మంది వహబీలు అమరులయ్యారు. అటువంటి వారిలో షహీద్‌ పీర్‌ ఆలీ, ఇనాయత్‌ అలీ, ఫర్హత్‌ హుస్సేన్‌, మహమ్మద్‌ షౌకత్‌ అలీ ముఖ్యులు. వహబీల నుండి ఎదురవుతున్నతీవ్ర ప్రతిఘటనను సహంచలేని బ్రిటీష్‌ వలస పాలకులు వహబీల మీదా అనేక కుట్ర కేసులు బనాయించి వందలాది వహబీ వీరులను రకరకాల తీవ్ర శిక∆లకు గురిచేశారు.

ఆ కాలంలోనే ఫరీద్‌పూర్‌కు చెందిన పీర్‌ షరీయతుల్లా నేతృత్వంలో మరో పోరాటం ప్రారంభమైంది. ఈ పోరు ఫరైజీ ఉద్యమంగా ప్రఖ్యాతి గాంచింది. ఈస్ట్‌ ఇండియా కంపెనీకి తొత్తులైన జమీందార్లు, వడ్డీ వ్యాపారులు, తేయాకు తోటల యజమానులు ఆప్రాంతం రైతుల మీద, సామాన్య జనం మీద సాగిస్తున్నపీడనకు వ్యతిరేకంగా ఈతిరుగుబాటు ప్రారంభమైంది. ఈ తొత్తులకు అండదండగా కంపెనీ పాలకులు రావటంతో ఉద్యమకారుల అస్త్రశస్త్రాలు బ్రిటీష్‌ వలస పాలకులవైపుగురి పెట్టబడ్డాయి.

ఈ ఉద్యామానికి హజీ పీర్‌ షరీయతుల్లా శ్రీకారం చుట్టినప్పటికి ఆ ఉద్యమం దశను దిశను మార్చి సమరశీల పోరాటంగా బ్రిటీషర్లను ఖంగు తినిపించిన మహాయోధుడు దాదు మియా. ఆయన హాజీ షరియతుల్లా నేతృత్వంలో రైతాంగం, వివిధ వృత్తుల సామాన్య

17